నాని వదిలేసిన సినిమాలన్నీ నితిన్ కేనా!
కొందరు డైరెక్టర్లు హీరో ఇమేజ్ ఆధారంగా కథలు సిద్దం చేస్తుంటారు. ఆ కథల్లో ...పాత్రల్లో వాళ్లు అయితేనే న్యాయం చేయగలరని ఎంతో బలంగా నమ్మి రాస్తారు.
By: Tupaki Desk | 24 July 2025 6:00 PM ISTకొందరు డైరెక్టర్లు హీరో ఇమేజ్ ఆధారంగా కథలు సిద్దం చేస్తుంటారు. ఆ కథల్లో ...పాత్రల్లో వాళ్లు అయితేనే న్యాయం చేయగలరని ఎంతో బలంగా నమ్మి రాస్తారు. తీరా అదే కథ ఆ హీరో దగ్గరకు వెళ్లిన తర్వాత నచ్చొ చ్చు..నచ్చకపోవచ్చు. నచ్చితే డైరెక్టర్ హ్యాపీ. లేకపోతే కొంత నిరుత్సాహ తప్పదు. అటుపై మరో హీరోతో రాజీ పడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా కథల్లో హీరోలు మారుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ కథల్ని హోల్డ్ లో పెట్టి కొత్త కథలతో తెరపైకి వస్తుంటారు. ఇది నమ్మకం కష్టమే.
ఎందుకంటే హీరో రిజెక్ట్ చేసాడు? అన్న మాట నెగిటివ్ అవుతుంది కాబట్టి ఎవరూ చెప్పే ప్రయత్నం చేయరు. తాజాగా అలాంటి విషయమే ఒకటి తెరపై కి వచ్చింది. `బలగం` దర్శకుడు వేణు నాని తో `ఎల్లమ్మ` సినిమా తీయాలనుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కానీ ఎల్లమ్మ నుంచి నాని తప్పుకోవడంతో ఆ కథలోకి యూత్ స్టార్ నితిన్ వచ్చాడు. నాని ఏ కారణంగా తప్పుకున్నాడు? అంటే తొలుత కథ విషయంలో సంతృప్తిగా లేకపోవడంతో స్కిప్ అయినట్లు ప్రచారంలోకి వచ్చింది.
కానీ అసలు సంగతి ఇది అని దిల్ రాజు రివీల్ చేసారు. నానికి కథ నచ్చక కాదు డేట్లు సర్దుబాటు కాక తప్పు కున్నాడు. డైరెక్టర్ ని ఏడాదిన్నర పాటు వెయిట్ చేయాలి అన్నాడట. ఇది దిల్ రాజు కు కూడా నచ్చక పోవడంతో ఆ ప్రాజెక్ట్ లోకి నితిన్ ని తెచ్చినట్లు రాజుగారి మాటల్లో అర్దమైంది. అలాగే నితిన్ నటిం చిన మరో చిత్రం `రాబిన్ హుడ్` కూడా నాని చేయాల్సి ఉందట. కానీ నాని చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఆ కథ నితిన్ కి చేరినట్లు తెలిసింది. ఇంకా నితిన్ చేసిన మరికొన్ని సినిమాల విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయిందంటున్నారు.
అయితే ఇలా రిజెక్ట్ అవ్వడానికి కారణం కథలు నచ్చకపోవడం కంటే డేట్లు అడ్జస్ట్ కాకపోవడం వల్లే నాని వాటిని వదులుకున్నట్లు రాజుగారి మాటల్లో సారాశంగా కనిపిస్తుంది. టైర్ 2 హీరోలు నటించే చాలా సినిమాల విషయంలో అదే జరుగుతుంది. స్టార్ హీరోల చిత్రాల విషయంలోనూ కథలు ఎక్కుగా రిజెక్ట్ అవ్వడం కనిపిస్తుంది. ఇవన్నీ హీరోలకు...డైరెక్టర్లకు సహజమైన విషయాలే.
