Begin typing your search above and press return to search.

శేఖ‌ర్ క‌మ్ములకు నో..సూర్య డైరెక్ట‌ర్‌కు య‌స్‌!

సినిమా ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎలాంటి మ‌లుపులు చోటు చేసుకుంటాయో చెప్ప‌డం క‌ష్టం.

By:  Ravindar Gorantla   |   14 March 2026 9:00 PM IST
శేఖ‌ర్ క‌మ్ములకు నో..సూర్య డైరెక్ట‌ర్‌కు య‌స్‌!
X

సినిమా ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎలాంటి మ‌లుపులు చోటు చేసుకుంటాయో చెప్ప‌డం క‌ష్టం. ఒక‌రు చేయాల్సిన ప్రాజెక్ట్ మ‌రొక‌రి చేతుల్లోకి వెళ్లిపోవ‌డం ఇక్క‌డ కామ‌న్‌. అలాగే ఓ హీరో చేయాల్సిన సినిమా మ‌రో హీరోకు వెళుతూ ఉంటుంది. అలాగే ఓ డైరెక్ట‌ర్‌తో చేయాల్సిన హీరో మ‌రో డైరెక్ట‌ర్‌కు మార‌డం కూడా ఇక్క‌డ కామ‌నే. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే జ‌రిగిందని తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న శేఖ‌ర్ క‌మ్ముల గ‌త ఏడాది ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా `కుబేర‌` మూవీని రూపొందించిన విష‌యం తెలిసిందే.

ఆశించిన స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోయినా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని మాత్రం సొంతం చేసుకుని ద‌ర్శ‌కుడిగా శేఖ‌ర్ క‌మ్ముల‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇందులో కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీకి ముందు నుంచి శేఖ‌ర్ కమ్ముల నేచుర‌ల్ స్టార్ నానితో సినిమా చేయాల‌ని ఓ స్క్రిప్ట్‌పై చాలా రోజులుగా వ‌ర్క్ చేస్తున్నారు. అయితే స్క్రిప్ట్ విన్న నాని అందులో మార్పులు చెప్పాడ‌ట‌. ఆ మార్పులు చేసి మ‌ళ్లీ కొత్త వెర్ష‌న్ వినిపించినా అది నానికి న‌చ్చ‌లేద‌ని తెలిసింది.

దీంతో శేఖ‌ర్ కమ్ముల ఇప్ప‌డు త‌న మార్కు యూత్ ఫుల్ డ్రామాని చేయాలని యంగ్ హీరోల‌ని ఫైన‌ల్ చేసుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్ కుద‌ర‌క‌పోవ‌డంతో ఆ స్థానంలో నాని క్రేజీ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరితో చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. నాని ప్ర‌స్తుతం శ్రీ‌కాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న `ది ప్యార‌డైజ్‌`లో న‌టిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో జ‌రుగుతోంది.

దీని తరువాత సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో `బ్ల‌డీ రోమియో` చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ త‌రువాతే వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ప్ర‌స్తుతం సూర్య హీరోగా `విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్‌` మూవీ చేస్తున్నాడు. సార్‌, లక్కీ భాస్క‌ర్ వంటి సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి `విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్` త‌రువాత నానితో ఓ డిఫ‌రెంట్ మూవీని ప్లాన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

నేచుర‌ల్ స్టార్ నాని బాడీ లాంగ్వేజ్‌కి త‌గ్గ ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేశార‌ట‌. ఇటీవ‌లే విన్న నానిఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీనే నిర్మించ‌నున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. వెంకీ అట్లూరితో `రంగ్ దే`, `సార్‌`, ల‌క్కీ భాస్క‌ర్‌, ఇప్పుడు విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ వంటి నాలుగు సినిమాలు సితార వారే నిర్మించారు. అదీ ఎలాంటి గ్యాప్ లేకుండా. నాని ప్రాజెక్ట్‌తో వెంకీ, సితార బ్యాన‌ర్‌లో వ‌రుస‌గా ఐదు సినిమాలు చేసిన డైరెక్ట‌ర్‌గా రికార్డు సాధించ‌డం ఖాయం.