'విశ్వనాథ్ అండ్ సన్స్' ను మిస్సయిన మన తెలుగు హీరోలు వీళ్లేనా?
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' కి మంచి స్పందన వచ్చింది.
By: Ramesh Palla | 20 Aug 2026 3:00 PM ISTసూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' కి మంచి స్పందన వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తమిళనాడులోనూ ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు రిపోర్ట్‌లు వస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా దాదాపు రూ.170 కోట్లు రాబట్టింది. సెకండ్ వారంలోనూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గానే ఉండబోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సూర్య యాక్టింగ్‌తో పాటు మమిత బైజు యాక్టింగ్‌కి ప్రశంసలు దక్కిన విషయం తెల్సిందే. విశ్వనాథ్ అండ్ సన్స్‌తో మరో పరభాష హీరోకు దర్శకుడు వెంకీ అట్లూరి హిట్ ఇచ్చాడని, ఇతడు తెలుగు హీరోలతో సినిమాలు చేయడా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశ్వనాథ్ అండ్ సన్స్ స్క్రిప్ట్ సూర్య వద్దకు వెళ్లక ముందే ఇద్దరు తెలుగు హీరోల వద్దకు వెళ్లిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
లక్కీ భాస్కర్ సినిమా తర్వాత వెంకీ అట్లూరి...
దుల్కర్ సల్మాన్‌తో వెంకీ అట్లూరి రూపొందించిన 'లక్కీ భాస్కర్' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సమయంలోనే పలువురు తెలుగు హీరోలు వెంకీ అట్లూరి తో సినిమాను చేసేందుకు ఆసక్తి చూపించారు. కాస్త గ్యాప్ తీసుకుని వెంకీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్‌తో మొదట నాని వద్దకు వెంకీ వెళ్లాడని తెలుస్తోంది. నాని ఈ సబ్జెక్ట్ కి న్యాయం చేస్తాడని వెంకీ భావించాడట. అయితే నాని ది ప్యారడైజ్ సినిమా కోసం బల్క్ డేట్లు ఇచ్చి ఉండటంతో పాటు, కొత్త సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం పడుతుందని చెప్పడం తో వెంకీ అక్కడ నుంచి వెనుతిరగాల్సి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. నాని కి పాయింట్ బాగా నచ్చిందని, వెయిట్ చేస్తే తప్పకుండా చేద్దామని కూడా వెంకీతో చెప్పినట్లు కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.
నాని, వెంకటేష్ బిజీ కారణంగా...
నాని బిజీ షెడ్యూల్ కారణంగా వెంకటేష్ వద్దకు దర్శకుడు వెంకీ వెళ్లాడట. కారణం ఏంటో తెలియదు కానీ వెంకటేష్ సైతం 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలో నటించలేదు. ప్రస్తుతం వెంకటేష్ రెండు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ కారణంగానే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను చేసేందుకు వెంకటేష్ టైమ్ అడిగి ఉంటాడు. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది, ఇంకా వెయిట్ చేయలేనని దర్శకుడు వెంకీ తన విశ్వనాథ్ అండ్ సన్స్ ను తమిళ హీరో సూర్యతో చేసి ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ఒక మంచి సబ్జెక్ట్, కమర్షియల్ హిట్‌ను మన తెలుగు హీరోలు మిస్ చేసుకున్నారు. సూర్య కాకుండా మన తెలుగు హీరోలు నేరుగా తెలుగులో ఈ సినిమాను చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదని, ఇంకా పెద్ద నెంబర్స్ నమోదు అయ్యి ఉండేవి అనేది సినీ వర్గాల వారి అభిప్రాయం. విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి మంచి సినిమాను నాని, వెంకటేష్ మిస్ చేసుకోవడం విచారకరం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సూర్య, వెంకీ అట్లూరి 'విశ్వనాథ్ అండ్ సన్స్'...
విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి ఒక తెలుగు హీరోతో సినిమాను చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ హీరో సైతం ఇప్పటికే కమిట్ అయ్యి ఉన్న సినిమా కారణంగా డేట్లు ఇవ్వలేక పోతున్నాడని, మరో ఇద్దరు ముగ్గురు హీరోలకి కూడా వెంకీ తన వద్ద ఉన్న లైన్స్ చెప్పాడని, కానీ ఎవరూ కూడా ఇప్పటికిప్పుడు డేట్లు ఇచ్చేందుకు రెడీగా లేరని తెలుస్తోంది. అందుకే వెంకీ మళ్లీ తమిళ హీరోతో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే వెంకీ తదుపరి సినిమా తమిళ హీరో ధనుష్‌తో అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంలో మాత్రం త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు హీరోతో సినిమా ఆలస్యం అయితే ఈ గ్యాప్‌లో ధనుష్ తో ముందుగా అనుకున్న ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని అన్నాడు. కనుక వెంకీ అట్లూరి తదుపరి సినిమా సైతం తమిళ హీరోతోనే కానుంది. మరి ధనుష్‌తో చేయబోతున్న సినిమా హిట్ అయితే ఫీల్ అయ్యే తెలుగు హీరోలు ఎవరో అనేది చూడాలి.
