మెగాస్టార్ మాట కాదనలేక హీరో నిర్మాతగా!
అయితే ఈ సినిమాకు నాని నిర్మాత అవ్వడం అన్నది ఆసక్తికరం.
By: Tupaki Desk | 5 May 2025 6:42 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఆయన 158వ సినిమాకు 'దసరా' ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది భారీ యాక్షన్ థ్రిల్లర్. మెగాస్టార్ లో మళ్లీ రాక్షసుడిని బయటకు తెస్తున్న చిత్రమిది. దీంతో సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. పాన్ ఇండియాలో ఎలాంటి సంచలనం నమోదు చేస్తుందని బజ్ భారీగా పెరిగిపోతుంది.
అయితే ఈ సినిమాకు నాని నిర్మాత అవ్వడం అన్నది ఆసక్తికరం. నాని సొంతంగా వాల్ పోస్టర్ నిర్మాణ సంస్థను స్థాపించి చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కంటెంట్ బేస్డ్ చిత్రాలు నిర్మిస్తు మంచి విజయాలు అందుకుంటున్నాడు. తద్వారా మంచి లాభాలు చూస్తున్నాడు. అలా వాల్ పోస్టర్ నిర్మాణ సంస్థకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. రోటీన్ కు భిన్నమైన సినిమాలు నిర్మించడం అన్నది ఆ సంస్థ ప్రత్యేకత.
మరి ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా అంటే నాని ఎన్నికోట్లు పెడుతున్నాడు? అని సందేహం రావడం సహజం. మరి నాని ఎన్ని కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు? అన్నది తెలియదు గానీ తాను నిర్మాతగా ఉండాలని చిరంజీవి మాత్రం కోరుకున్నారట. శ్రీకాంత్ కథ వినిపించిన తర్వాత నిర్మాత ఎవరు? అంటే సుధాకర్ పేరు చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరి నీ ప్రెండ్ నాని అంటే ఆయన నవ్వేసి ఊరుకోగా నాని తప్పకుండా తన సినిమాకు నిర్మాతగా ఉండాలని అడిగారట.
దీంతో నాని కూడా చిరంజీవి మాట కాదనలేక ఆ సినిమాకు నిర్మాతగా మారినట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాకు ఓ స్టార్ హీరో ఇంతవరకూ నిర్మాతగా వ్యవహరించలేదు. ఆ సన్నివేశం తొలిసారి చోటు చేసు కుంటుంది. ఆ రకంగా నాని అదృష్ట వంతుడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా బాపు వద్ద పని చేసి లక్కీ గయ్ అవ్వగా...ఇప్పుడు చిరు సినిమాకు నిర్మాతగా మారి మరోసారి అదృష్టవంతుడయ్యాడు.
