Begin typing your search above and press return to search.

నిర్ల‌క్ష్యం-అణిచివేత‌పై నాని పోరాటం!

నేచుర‌ల్ స్టార్ నాని పుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు.

By:  Tupaki Desk   |   29 Jun 2025 12:04 PM IST
నిర్ల‌క్ష్యం-అణిచివేత‌పై నాని పోరాటం!
X

నేచుర‌ల్ స్టార్ నాని పుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. ఇటీవ‌లే `హిట్-3`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహతో కొత్త సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఇప్ప‌టికే `ద‌స‌రా` త‌ర్వాత మ‌రోసారి శ్రీకాంత్ ఓదెల‌తో మ‌రోసారి చేతులు క‌లిపిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో `ది ప్యార‌డైజ్` ప్రారంభ‌మవ్వ‌డం, కొంత షూటింగ్ చేయ‌డం తెలిసిందే.

`హిట్ 3` సెట్స్ లో ఉండ‌టంతో తాత్కాలికంగా బ్రేక్ వేశారు. రిలీజ్ అనంత‌రం మ‌ళ్లీ య‌ధావిధిగా షూటిం గ్ పున ప్రారంభ‌మైంది. తాజాగా ఇటీవ‌లే మ‌రో కొత్త షెడ్యూల్ మొద‌లైంది. ప్ర‌స్తుతం ఓ భారీ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. ఇదే సెట్ లో 40 రోజుల పాటు షూటింగ్ జ‌రుగుతుంది. గ‌త వారం జ‌రిగిన షెడ్యూల్ లో హీరో బాల్యానికి సంబంధించిన స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమాకి సంబం ధించిన స్టోరీ లైన్ లీకైంది.

ఇప్ప‌టికే ఇది భారీ మాస్ చిత్ర‌మ‌ని తెలిసింది. `ద‌సరా`ని మించిన మాస్ కంటెంట్ గా వైర‌ల్ అయింది. కానీ పాయింట్ ఏంటి? అన్న‌ది రివీల్ కాలేదు. తాజాగా విష‌యం లీకైంది. స‌మాజంలో నిర్లక్ష్యానికి- అణిచి వేత కు గురైన ఓ తెగ క‌థ ఇది. ఇందులో నాని త‌న తెగ కోసం పోరాడే యోదుడి పాత్ర పోషిస్తున్నాడు. భిన్న మైన పాత్ర‌లో నాని క‌నిపిచంనున్నాడు. గ‌తంలో మునుపెన్న‌డు నాని పోషించిన రోల్ ఇది.

`ద‌స‌రా` ఓ జానర్ క‌థ అయితే ప్యార‌డైజ్ అందుకు భిన్నంగా మ‌రింత శ‌క్తివంత‌మైన క‌థ‌గా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని స్పానిష్‌, ఇంగ్లీష్ భాష‌ల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే అక్క‌డ నేప‌థ్యానికి కూడా క‌నెక్ట్ అయ్యే అవ‌కాశం ఉండటంతోనే ఈ ఛాన్స్ తీసుకుంటున్నారు. యూనివ‌ర్శల్ కాన్సెప్ట్ కావ‌డంతో నిర్మా త‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ముందుకెళ్తున్నారు. పాన్ ఇండియాలో భారీ ఎత్తున వ‌చ్చే ఏడాది మార్చి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.