నాని జడ్జిమెంట్ లెక్క ఇదే..!
హిట్ 3 విషయంలో నాని మళ్లీ తన కాన్ఫిడెన్స్ ని ప్రూవ్ చేసుకున్నాడు. నాని జడ్జిమెంట్ లెక్క ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.
By: Tupaki Desk | 2 May 2025 1:00 AM ISTప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సక్సెస్ లను అందుకుంటున్న స్టార్ ఎవరు అంటే అందరు చెప్పే పేరు ఒక్కటే ఆయనే న్యాచురల్ స్టార్ నాని. నాని ఎలాంటి సినిమా తీసినా కూడా అది నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ చేయడమే కాదు అంతకంత సక్సెస్ కూడా అందుకుంటుంది. పక్కింటి అబ్బాయి ఇమేజ్ ఉన్న నాని ఒక్కసారిగా దసరా తో తనలోని మాస్ యాంగిల్ తో సర్ ప్రైజ్ చేశాడు. దసరా తర్వాత మళ్లీ హాయ్ నాన్న తీసి సక్సెస్ అందుకున్నాడు. ఆ నెక్స్ట్ సరిపోదా శనివారం అంటూ మరో మాస్ కమర్షియల్ బొమ్మతో వచ్చి హిట్ కొట్టాడు.
ఇక హిట్ 3 తో లేటెస్ట్ మరో మాస్ కాదు కాదు క్రైం థ్రిల్లర్ తో వచ్చి మళ్లీ మంచి ఫలితాన్ని అందుకున్నాడు. హిట్ 2 లో క్యామియో రోల్ లో నాని వచ్చే సరికి హిట్ 3లో అతనే హీరో అని ఫిక్స్ అయ్యారు. కానీ హిట్ 3 ప్రమోషన్స్ లో నాని ఏం చెప్పాడంటే చివర్లో అలా ఒక హీరో వస్తే బాగుంటుందని మాత్రమే అది పెట్టామని అప్పటికి హిట్ 3 తాను చేస్తాను అనే క్లారిటీ లేదని అన్నారు. కానీ హిట్ 3 కథ శైలేష్ చెప్పగానే తనకు నచ్చి ప్రాజెక్ట్ చేశాడు.
హిట్ 3 విషయంలో నాని మళ్లీ తన కాన్ఫిడెన్స్ ని ప్రూవ్ చేసుకున్నాడు. నాని జడ్జిమెంట్ లెక్క ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా పక్కా క్రైం థ్రిల్లర్ చిన్న పిల్లలు చూడొద్దని ధైర్యంగా చెప్పి మరీ సక్సెస్ అందుకున్నాడు. నానికి సినిమా పట్ల ఉన్న అంకితభావం.. ప్రేమ.. అభిమానం ఎలాంటిదో అతను చేస్తున్న సినిమాలు చూస్తే అర్థమవుతుంది.
అంతేకాదు రకరకాల జానర్లలో సినిమాలు చేస్తూ తన వర్సటాలిటీ చూపిస్తున్నాడు. హిట్ 3 విషయంలో నాని సినిమా ఆడుతుంది అంటే కచ్చితంగా సక్సెస్ అవుతుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. హిట్ 3 లో కార్తి చివర్లో ఇచ్చిన క్యామియో కూడా అదిరిపోయింది. శైలేష్ కొలను కూడా లాస్ట్ సినిమా సైంధవ్ ఫ్లాప్ అయినా హిట్ 3 తో మళ్లీ సూపర్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. నాని నెక్స్ట్ ప్యారడైజ్ తో రాబోతున్నాడు. ఆ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ స్టేట్మెంటే సూపర్ సెన్సేషన్ అయ్యింది. మరి ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్.
