నాని కోసం కోర్ట్ డైరెక్టర్..?
ఐతే కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీష్ కోర్ట్ సినిమాను ఏదో అలా తీసేద్దాం అన్నట్టుగా తీయలేదు దాని మీద చాలా రీసెర్చ్ చేశాడు.
By: Tupaki Desk | 14 May 2025 8:00 AM ISTహీరోగానే కాదు నిర్మాతగా కూడా నాని తన అభిరుచిని చూపిస్తున్నాడు. అ! తో మొదలైన నాని నిర్మాణ ప్రయాణం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూనే ఉంది. నాని నటించిన సినిమా పక్కా హిట్ అనేలా క్రేజ్ తెచ్చుకోగా ఇప్పుడు నాని నిర్మించిన సినిమా డబుల్ ఓకే అనేలా ఆడియన్స్ నుంచి రియాక్షన్ తెచ్చుకున్నాడు. అ! సినిమా నుంచి నాని నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు. హిట్ ఫ్రాంచైజీలు కూడా నాని నిర్మాణంలోనే వస్తున్నాయి. ఇక వాటితో పాటు ఈమధ్యనే కోర్ట్ అనే ఒక సినిమా చేశాడు నాని. రామ్ జగదీష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుని కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది.
కోర్ట్ సినిమా కథ కథనాలు తెరకెక్కించిన విధానం ఎంత బాగుందో ఈ సిన్సియర్ ఎఫర్ట్ ని నాని అంత బాగా ప్రమోట్ చేయడం వల్లే జనాలకు రీచ్ అయ్యింది. ఒకసారి థియేటర్ కి కామన్ ఆడియన్ వచ్చి సినిమా బాగుంది అని సర్టిఫికెట్ ఇస్తే ఆ సినిమాని ఆపడం ఎవరి వల్లా కాదు. అలా కోర్ట్ సినిమా సూపర్ హిట్ కొట్టింది. కోర్ట్ మాత్రమేనా నాని రీసెంట్ గానే హిట్ 3 తో కూడా మరో సూపర్ హిట్ అందుకున్నాడని తెలిసిందే.
ఐతే కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీష్ కోర్ట్ సినిమాను ఏదో అలా తీసేద్దాం అన్నట్టుగా తీయలేదు దాని మీద చాలా రీసెర్చ్ చేశాడు. అందుకే అది జనాలకు బాగా నచ్చింది. అందుకే అతని టాలెంట్ గుర్తించి రామ్ జగదీష్ రెండో సినిమా ఆఫర్ కూడా నానినే ఇచ్చాడట. ఐతే నాని నిర్మాణంలోనే ఈ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఐతే రామ్ జగదీష్ నాని ఇమేజ్ కి తగిన కథ సిద్ధం చేశాడట. నానికి కథ నచ్చితే మాత్రం రామ్ లక్కు పండినట్టే అని చెప్పొచ్చు.
ఐతే నానికి ఒకవేళ కొత్త కథ నచ్చినా అతను రెండేళ్ల దాకా బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెల తో ప్యారడైజ్ ని చేయాల్సి ఉంది. ఆ సినిమా నెక్స్ట్ మార్చి రిలీజ్ పెట్టుకున్నాడు. సుజిత్ తో కూడా ఒక సినిమా ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే నాని కొత్త సినిమా ఉంటుంది. మరి అప్పటిదాకా రామ్ జగదీష్ వెయిట్ చేస్తాడా ఆ ఛాన్స్ ఉందా అన్నది చూడాలి. ఐతే రామ్ జగదీష్ టాలెంట్ కోర్ట్ తో ప్రూవ్ అయ్యింది కాబట్టి తన కోసం తెచ్చిన కథను హోల్డ్ లో పెట్టి మరో కథతో నాని మరోసారి రామ్ జగదీష్ తో సినిమా నిర్మించే అవకాశాలు ఉన్నాయి. మరి అది ఎప్పుడు ఎలా కుదురుతుందో చూడాలి.
