నేచురల్ స్టార్‌పై తమిళ్ డైరెక్టర్ ఇంట్రెసింగ్ పోస్ట్!
ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో బెంగాలీ నటి సొనాలీ కులకర్ణి కీలక పాత్రలో నటించబోతోంది.
By: Tupaki Desk | 14 Jun 2025 11:06 AM ISTనేచురల్ స్టార్ నాని `హిట్ 3` సక్సెస్‌ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. దీని తరువాత త్వరలో `దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో రా కంటెంట్‌తో రాబోతున్న `ది ప్యారడైజ్` మూవీలో నటించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. సికింద్రాబాద్ ఏరియాలోని ప్యారడైజ్ ప్రాంతంలో జరిగిన ఓ యదార్థ కథ ఆధారంగా ఈ సినిమాని పక్కా రా కంటెంట్‌తో రష్టిక్ ఫిల్మ్‌గా తెరపైకి తీసుకురాబోతున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో బెంగాలీ నటి సొనాలీ కులకర్ణి కీలక పాత్రలో నటించబోతోంది. `రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్` ఫేమ్ కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ కోసం హీరో నాని సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు నాని సినిమాల బడ్జెట్‌కు మించి ఈ మూవీ కోసం ఖర్చు చేయబోతున్నారు. `దసరా`ని నిర్మించిన సుధాకర్ చెరుకూరినే ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని నిర్మించబోతున్నారు.
ఇదిలా ఉంటే శనివారం తమిళ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా హీరో నానిపై ఇంట్రెస్ట్ పోస్ట్‌ని పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఆ తమిళ డైరెక్టర్ మరెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు పొంది వార్తల్లో నిలిచిన అభిశన్ జీవిన్త్. తను దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన మూవీ `టూరిస్ట్ ఫ్యామిలీ`. శశికుమార్, సిమ్రాన్ జంటగా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రముఖుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నీరాజనాలందుకుంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.
దీంతో దర్శకుడిపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే రాజమౌళి, రజనీకాంత్, కన్నడ హీరో సుదీప్ `టూరిస్ట్ ఫ్యామిలీ`పై, దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు అభిశన్ జీవిన్త్ టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నానిని కలిశారట. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నానితో ఉన్న ఫొటోని షేర్ చేసిన అభిశన్ జీవిన్త్ దీనికి ఆసక్తికరమైన పోస్ట్‌ని జత చేశాడు. `ఎంతటి అద్భుతమైన రోజు ఇది!. నాని సార్ మిమ్మల్ని కలవడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను.
మీరు చాలా వినయపూర్వకమైన, దృఢమైన వ్యక్తి. మీరు సినిమా గురించి ఇంత వివరంగా చెప్పిన విధానం నాకు మరింత ప్రత్యేకమైనదిగా మారింది. మీకు ధన్యవాదాలు` అంటూ యువ దర్శకుడు అభిశన్ జీవిన్త్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. `టూరిస్ట్ ఫ్యామిలీ` మూవీని చూసిన నాని స్వయంగా తన వద్దకు దర్శకుడిని పిలిపించుకుని ప్రత్యేకంగా అభినందించడం విశేషం.
