నాని 'ది ప్యారడైజ్' కు ఫైనల్‌గా హీరోయిన్ ఫిక్స్!
శ్రీకాంత్ ఓదెలతో కలిసి నాని చేస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా `ది ప్యారడైజ్`. సుధాకర్ చెరుకూరి ఈ భారీ మూవీని నిర్మిస్తున్నారు. గ్లింప్స్‌తో హాట్ టాపిక్‌గా మారిన ఈ ప్రాజెక్ట్ త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
By: Tupaki Desk | 15 May 2025 10:46 AM ISTనేచురల్ స్టార్ నాని.. హీరోగా, నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లని సొంత చేసుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా `కోర్ట్` మూవీతో నిర్మాతగా బిగ్ సక్సెస్‌ని అందుకోవడమే కాకుండా తన గట్స్‌కు ప్రశంసల్ని దక్కించయుకున్నాడు. ఆ వెంటనే `హిట్ 3`తో హీరోగా మరో బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్న నాని ఈ సినిమా వసూళ్లతో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. రికార్డు స్థాయి వసూళ్లతో హిట్ 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
ఈ జోష్‌తోనే మరో వైల్డ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులని సర్‌ప్రైజ్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు నాని. `దసరా`తో తనని రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సారి ఓ కల్ట్ మూవీని వీరిద్దరు ప్రేక్షకులకు అందించబోతున్నారనే కామెంట్‌లు సర్వత్రా వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెలతో కలిసి నాని చేస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా `ది ప్యారడైజ్`. సుధాకర్ చెరుకూరి ఈ భారీ మూవీని నిర్మిస్తున్నారు. గ్లింప్స్‌తో హాట్ టాపిక్‌గా మారిన ఈ ప్రాజెక్ట్ త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
తెలంగాణ సికింద్రాబాద్ ఏరియాలో జరిగిన ఓ యదార్ధ గాధని ఓ రైటర్ నవలగా రాశారు. దాని రైట్స్ తీసుకుని శ్రీకాంత్ ఓదెల `ది ప్యారడైజ్`ని తెరపైకి తీసుకొస్తున్నారు. గ్లింప్స్‌లో రా కంటెంట్‌తో అందరిని ఆశ్చర్యపరిచిన ఈ టీమ్ సినిమాతో మరింత షాక్‌కు గురి చేయడానికి రెడీ అవుతోంది. ఇందులో నాని క్యారెక్టర్ మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా రాగా సాగుతుందని గ్లింప్స్‌తో అర్థమైంది. రెండు జడలు వేసుకుని విభిన్నమైన గెటప్‌తో నాని నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌ని ఇంత వరకు ఫైనల్ చేయలేదు. తాజాగా క్రేజీ హీరోయిన్ కాయదు లోహర్‌ని ఫైనల్ చేసినట్టుగా తెలిసింది.
`డ్రాగన్` మూవీలో కాయదు లోహర్ మరింతగా పాపులర్ కావడం తెలిసిందే. అదే నాని సినిమాలో అవకాశం పొందేలా చేసిందట. పలువురు కీలక నటీనటులు నటించనున్న ఈ మూవీకి మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు. గ్లింప్స్‌కే కోటిపైనే ఖర్చు చేసిన టీమ్ ఈ మూవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట. డ్యాగ్రౌండ్ మ్యూజిక్‌లో స్పెషలిస్ట్‌గా మారిన అనిరుధ్‌తో ఈ మూవీకి హైలైట్‌గా నిలిచే బీజిఎమ్స్‌ని చేయిస్తున్నారట. అంతే కాకుండా ఇందులో మొత్తం 6 పాటలుంటాయని, అవి కూడా సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తాయని ఇన్ సైడ్ టాక్.
