నాని కోసం ' డ్రాగన్ ' బ్యూటీ లాక్!
అయితే తాజా సమాచారం ప్రకారం.. నాని కోసం ' డ్రాగన్' బ్యూటీ కయాదు లోహర్ ను లాక్ చేసినట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 10 May 2025 8:00 PM ISTహిట్ 3తో అటు నటుడిగా, ఇటు నిర్మాతగా సక్సెస్ చూసిన న్యాచురల్ స్టార్ నాని.. నెక్స్ట్ ' ది ప్యారడైజ్' అనే రా అండ్ రస్టిక్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ కాగా.. తమిళ రాక్‌స్టార్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 1980లో సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో ది ప్యారడైజ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన వీడియో గ్లింప్స్ కు అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా రెండు జడలతో నాని లుక్, గెటప్ ఊరమాస్‌గా అనిపించాయి.
చిన్న గ్లింప్స్ తోనే మూవీపై అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ది ప్యారడైజ్ కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. ఇంతవరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది నిర్మాతలు అనౌన్స్ చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. నాని కోసం ' డ్రాగన్' బ్యూటీ కయాదు లోహర్ ను లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. అస్సాంకు చెందిన ఈ వయ్యారి.. కొద్ది నెలల క్రితం విడుదలైన డ్రాగన్ లో కోలీవుడ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ కు జోడీగా నటించి మెప్పించింది.
అంతకన్నా ముందు కన్నడ, మలయాళం, మరాఠీ భాషా చిత్రాల్లో మెరిసింది. తెలుగులోనూ కయాదు లోహర్ ఓ సినిమా చేసింది. అదే శ్రీవిష్ణు ' అల్లూరి'. 2022 రిలీజ్ అయిన ఈ చిత్రం పరాజయం పాలైంది. దాంతో కయాదు లోహర్‌కు సరైన గుర్తింపు దక్కలేదు. కానీ ఈ ముద్దుగుమ్ము డ్రాగన్ మూవీతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్ లో హీరోయిన్ గా కయాదు లోహర్ ను శ్రీకాంత్ ఎంపిక చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కయాదు ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదేవిధంగా ది ప్యారడైజ్ సినిమాలో మరో స్టార్ బ్యూటీ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఫుల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ ను 2026 మార్చి 26న రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఇప్పటికే అనౌన్స్ చేశారు. కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లోనూ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండటం విశేషం.
