ప్యారడైజ్ ఆడియో రైట్స్.. నాని కెరీర్లోనే హెయ్యెస్ట్
ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ఏం పట్టినా బంగారమే అవుతుంది. గత కొన్ని సినిమాలుగా తానేం చేసినా సూపర్ హిట్ లేదా బ్లాక్ బస్టరే అవుతున్నాయి
By: Tupaki Desk | 15 May 2025 12:48 PMప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ఏం పట్టినా బంగారమే అవుతుంది. గత కొన్ని సినిమాలుగా తానేం చేసినా సూపర్ హిట్ లేదా బ్లాక్ బస్టరే అవుతున్నాయి. హీరోగా సక్సెస్ అవడమే కాక నిర్మాతగా కూడా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు నాని. ప్రతీ సినిమాతో కొత్తదనాన్ని ట్రై చేస్తున్న నాని ఆ కొత్తదనంతోనే అందరినీ మెప్పిస్తూ విన్నర్ గా నిలుస్తున్నాడు.
రీసెంట్ గా హిట్‌వర్స్ లో భాగంగా సొంత బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్: ది థర్డ్ కేస్ సినిమాతో హీరోగా, నిర్మాతగా ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని ఆ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన అకౌంట్ లో వేసుకున్నాడు. హిట్3 తర్వాత నాని ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
నానికి దసరా లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన శ్రీకాంత్ ఓదెల తో కలిసి నాని ది ప్యారడైజ్ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ప్యారడైజ్ నుంచి రా స్టేట్‌మెంట్ పేరుతో గ్లింప్స్ రూపంలో ఓ వీడియో రిలీజవగా దానికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ చూస్తుంటే ప్యారడైజ్ లో నాని లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్ ను చేయనున్నట్టు అనిపిస్తోంది.
నాని కెరీర్లో ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. దానికి తోడు ది ప్యారడైజ్ గ్లింప్స్ కు సౌత్ సెన్సేషన్ అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉంటూ అందరినీ తెగ ఇంప్రెస్ చేసింది. ఇదిలా ఉంటే నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమా ఆడియో రైట్స్ నాని కెరీర్లోనే హయ్యెస్ట్ రేటుకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది.
ప్యారడైజ్ ఆడియో రైట్స్ ను సరిగమ ఆడియో కంపెనీ అన్ని భాషలనూ కలిపి రూ. 18కోట్లకు కొనుగోలు చేసింది. నాని సినిమాకు కేవలం ఆడియో ద్వారానే రూ. 18 కోట్లు బిజినెస్ జరిగిందంటే ఇది చిన్న విషయం కాదు. అయితే సరిగమ ఇంత రేటు పెట్టడం వెనుక కొన్ని రీజన్స్ ఉన్నాయి. నాని- శ్రీకాంత్ కాంబినేషన్ మీద హైప్ ఉండటంతో పాటూ, అనిరుధ్ సంగీతానికి సౌత్ లో మంచి క్రేజ్ ఉండటం, దానికి తోడు సినిమా రిలీజ్ కు ముందే నాని సినిమాల్లోని పాటలు మంచి హిట్స్ గా నిలుస్తుండటంతోనే సదరు ఆడియో కంపెనీ అంత భారీ రేటుకు ప్యారడైజ్ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.