దాని కోసం నాని మారుతున్నాడా?
రీసెంట్ గా హిట్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం పెద్ద ఎత్తున మేకోవర్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
By: Tupaki Desk | 8 May 2025 5:01 AMరీసెంట్ గా హిట్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం పెద్ద ఎత్తున మేకోవర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. హిట్3 బాక్సాఫీస్ వద్ద దాదాపు ఆఖరి స్థాయికి చేరుకుంది. యూఎస్ఎ, నైజాం లాంటి ప్రాంతాల్లో హిట్3 బ్రేక్ ఈవెన్ అయి, మంచి కలెక్షన్లు రాబట్టుకుంది.
కానీ మిగిలిన ఏరియాల్లో మాత్రం హిట్3 మిక్డ్స్ టాక్ తో నిరాశ పరిచిందనే చెప్పాలి. హిట్3 కోసం వీలైనంత కష్టపడటంతో పాటూ ఆ తర్వాత ప్రమోషన్స్ ను ఎంతో యాక్టివ్ గా నిర్వహించిన నాని, ఇప్పుడు చేసేదేమీ లేక తన తర్వాతి సినిమాపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం నాని అమెరికా టూర్ లో ఉన్న విషయం తెలిసిందే.
త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్న నాని, వచ్చిన తర్వాత ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగే పీరియాడికల్ డ్రామాగా ది ప్యారడైజ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని లుక్ నుంచి క్యారెక్టర్ వరకు అన్నీ చాలా కొత్తగా ఉండనున్నట్టు ఆల్రెడీ ప్యారడైజ్ నుంచి వచ్చిన రా స్టేట్‌మెంట్ చూస్తే అర్థమైపోతుంది.
నానికి దసరా లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ కు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈసారి దసరాను మించిన మాస్ ఉంటుందని ఇప్పటికే నాని, శ్రీకాంత్ పలుమార్లు చెప్పగా, ఈ సినిమాలో నాని తెలంగాణ యాస మాట్లాడనున్నాడు. ప్యారడైజ్ మ్యాడ్ మ్యాక్స్ ఫిల్మ్ అని చెప్పిన నాని ఈ ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నాని, నార్త్ లో మాత్రం ఇంకా తనదైన ముద్ర వేయలేకపోయాడు. ది ప్యారడైజ్ సినిమా తనకు పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు తెస్తుందని నాని నమ్ముతున్నాడు. ప్యారడైజ్ తో ఎలాగైనా దేశవ్యాప్తంగా తన ఉనికిని చాటాలని నాని టార్గెట్ గా పెట్టుకున్నాడు.