Begin typing your search above and press return to search.

సుజిత్ సినిమా వ‌చ్చేది అప్పుడే!

గ‌తేడాదే ఈ సినిమా గురించి అఫీషియ‌ల్ గా అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్ప‌టివ‌రకు ఆ సినిమా మొద‌లైంది లేదు.

By:  Tupaki Desk   |   26 April 2025 11:05 AM
Sujeeth Nani Movie Update
X

టాలీవుడ్ లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. ద‌స‌రా, హాయ్ నాన్న‌, సరిపోదా శ‌నివారం సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాని మినిమం గ్యారెంటీ హీరో అయిపోయాడు. నాని నుంచి సినిమా వ‌స్తుందంటే అందులో కంటెంట్ ఉంటుంద‌ని ఆడ‌డియ‌న్స్ న‌మ్మే రేంజ్ కి అత‌ను వ‌చ్చేశాడు. అందుకే నానితో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు కూడా వెనుక‌డుగు వేయ‌డం లేదు.

నాని కూడా సినిమా సినిమాకీ ఎక్కువ గ్యాప్ లేకుండా ఒక సినిమా రిలీజైన వెంట‌నే మ‌రో సినిమాను మొదలుపెట్టి ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే ప‌నిలో ఉంటాడు. ప్ర‌స్తుతం నాని న‌టించిన‌ హిట్3 సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. శైలేష్ దర్శ‌క‌త్వంలో హిట్ ఫ్రాంచైజ్ లో వ‌చ్చిన‌ మూడో కేస్ గా ఈ సినిమా ను నాని త‌న సొంత బ్యాన‌ర్ లో నిర్మిస్తూ న‌టించాడు.

మే 1న హిట్3 రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజైన వెంట‌నే నాని, త‌న త‌ర్వాతి సినిమా అయిన ది ప్యార‌డైజ్ షూటింగ్ లో పాల్గొన‌నున్నాడు. అయితే హిట్3 టైమ్ లోనే నాని మ‌రో సినిమాను కూడా ఓకే చేశాడు. అదే సుజిత్ డైరెక్ట‌ర్ గా చేయాల్సిన సినిమా. గ‌తేడాదే ఈ సినిమా గురించి అఫీషియ‌ల్ గా అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్ప‌టివ‌రకు ఆ సినిమా మొద‌లైంది లేదు.

దానికి కార‌ణం సుజిత్ ఓజి సినిమాతో లాక్ అవ‌డ‌మే. ఒకానొక టైమ్ లో సుజిత్- నాని సినిమా ఆగిపోయింద‌ని కూడా వార్త‌లొచ్చాయి. కానీ హిట్3 ప్ర‌మోష‌న్స్ లో నాని సుజిత్ సినిమా విష‌యంలో క్లారిటీ ఇచ్చాడు. సుజిత్ తో త‌న సినిమా త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని, కాక‌పోతే షూటింగ్ కాస్త లేట్ గా మొద‌లవుతుంద‌ని నాని అంద‌రి అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

సుజిత్ తో తాను చేయ‌బోయే సినిమా 2027లో రిలీజ్ అవుతుంద‌ని కూడా నాని ఈ సంద‌ర్భంగా తెలిపాడు. ముందుగా ఈ సినిమాను డీవీవీ ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్లో దాన‌య్య నిర్మిస్తాడ‌ని అన్నారు. కానీ త‌ర్వాత‌ కొన్ని కార‌ణాల వ‌ల్ల దాన‌య్య ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోగా ఆ ప్లేస్ లోకి వెంక‌ట్ బొల్లినేని చేరాడు. గ‌తంలో వెంక‌ట్ బొల్లినేని నానితో శ్యామ్ సింగ‌రాయ్ మూవీ చేయ‌గా ఆ సినిమా మంచి హిట్ అయిన విష‌యం తెలిసిందే.