Begin typing your search above and press return to search.

నాని ఆ సినిమా ఏమైనట్టో..?

ఇదిలా ఉంటే త్వరలో నాని హిట్ 3 తో రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ చూస్తే ఇది నాని మార్క్ యానిమల్ విధ్వంసంగా అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   8 April 2025 10:04 AM IST
Nani Sujeeth Movie Update
X

న్యాచురల్ స్టార్ నాని ఈమధ్య వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు. నాని కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కువ సినిమాలు సక్సెస్ లే ఉన్నా మధ్యలో కెరీర్ కొంత రిస్క్ ఫేజ్ ని ఎదుర్కొన్నాడు. అఫ్కోర్స్ అది దాటాకనే అసలు జీవితం ఉంటుందని కనిపెట్టాడు కాబట్టే ఆ టైం లో జాగ్రత్తగా అడుగులో అడుగులు వేస్తూ వచ్చాడు. ఫైనల్ గా నాని న్యాచురల్ స్టార్ గా మారి తను ఎదుగుతూ తన చుట్టుపక్కన ఉన్న వారిని కూడా ఎదిగేందుకు కారణం అవుతున్నాడు.

నాని సినిమా నెవర్ డిజప్పాయింట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే అతని సినిమాల సక్సెస్ పర్సెంటేజ్ బాగుంది. మిగతా హీరోలేమో వరుస ఫ్లాపులతో పడిపోతున్న గ్రాఫ్ ఎలా లేపాలో తెలియక సతమతమవుతుంటే నాని మాత్రం ఎంచక్కా ఇలా వస్తున్నాడు అలా హిట్టు కొట్టి వెళ్తున్నాడు. అఫ్కోర్స్ దాని వెనుక అతని కష్టం ఎంతన్నది తెలిసిందే. నాని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేస్తున్నాడు కాబట్టే సక్సె రేటు అలా ఉంది.

ఇదిలా ఉంటే త్వరలో నాని హిట్ 3 తో రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ చూస్తే ఇది నాని మార్క్ యానిమల్ విధ్వంసంగా అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు నాని. ఐతే సాహో డైరెక్టర్ సుజిత్ తో నాని ఒక సినిమా ఉంటుందని అప్పట్లో ఒక అనౌన్స్ మెంట్ వచ్చింది. డివివి బ్యానర్ లో ఆ సినిమా నిర్మించాలని అనుకున్నారు.

నాని సరిపోదా శనివారం సినిమా టైం లోనే ఈ ప్రకటన వచ్చింది. చిన్న వీడియో కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమా ఏమైందో ఎవరికీ తెలియదు. సుజిత్ ఓ పక్క పవన్ తో ఓజీ పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తి చేశాక కానీ మరో సినిమా చేసే ఛాన్స్ లేదు. నాని కూడా సినిమా అనుకున్నామా సెట్స్ మీదకు తీసుకెళ్లామా రిలీజ్ చేశామా అన్నట్టు ఉంటాడు. సుజిత్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి దాదాపు ఏడాది అవుతుంది. ఇప్పటివరకు ఆ సినిమా నెక్స్ట్ అప్డేట్ రాలేదు. అసలు సుజిత్ తో నాని సినిమా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

సుజిత్ సాహో తర్వాత సినిమా చేయడమే లేట్ అనుకుంటే పవన్ కళ్యాణ్ తో ఓజీ మరింత లేట్ అవుతుంది. ప్రతిభగల దర్శకుడు ఇలా ఒక సినిమా కోసం 4, 5 ఏళ్లు వెయిట్ చేస్తే ఎలా అనుకుంటున్నారు ఆడియన్స్. లేట్ అయినా కూడా నానితో సుజిత్ సినిమా ఉంటే అది నెక్స్ట్ లెవెల్ సినిమా అవుతుందని అంటున్నారు.