బ్లడీ రోమియో టైటిల్ తో న్యాచురల్ స్టార్..?
న్యాచురల్ స్టార్ నాని సినిమాల లైనప్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. నాని ప్రస్తుతం హిట్ 3 ని పూర్తి చేశాడు.
By: Tupaki Desk | 25 April 2025 6:50 PM ISTన్యాచురల్ స్టార్ నాని సినిమాల లైనప్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. నాని ప్రస్తుతం హిట్ 3 ని పూర్తి చేశాడు. సినిమా కోసం ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. హిట్ 3 తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల తో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. దసరా కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. ప్యారడైజ్ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ స్టేట్మెంట్ నాని ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. సినిమాతో నాని మరో డేర్ స్టెప్ వేస్తున్నాడని తెలుస్తుంది.
శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో మొదలు కానుంది. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఆ మూవీని పూర్తి చేసి నెక్స్ట్ మార్చి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే ప్యారడైజ్ తో పాటు నెక్స్ట్ ఇయర్ సుజిత్ తో నాని చేసే సినిమా కూడా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. సుజిత్ నాని కాంబో సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఐతే ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో మొదలవుతుందని తెలుస్తుంది.
ఈ సినిమా రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని టాక్. సినిమా టైటిల్ గా బ్లడీ రోమియోగా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ టైటిల్ విని ఫ్యాన్స్ సూపర్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం నాని సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్స్ లో ఉన్నాడు.
సుజిత్ నాని కాంబోలో రాబోతున్న బ్లడీ రోమియో సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ రోజే రిలీజ్ చేసిన ఒక వీడియో చూసి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. నాని మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలన్నీ మళ్లీ నాని స్టామినాని ప్రూవ్ చేస్తాయేమో చూడాలి. నాని ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారాడు. తన సినిమాలు చేయడమే కాదు నిర్మాతగా మరికొంతమంది టాలెంటెడ్ పీపుల్ కి ఛాన్స్ లు ఇస్తున్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే మాత్రం నానిని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. హిట్ 3 మే 1న వస్తుండగా ఆ సినిమాతో మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు నాని. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన హిట్ 3 సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
