Begin typing your search above and press return to search.

కన్నడ యాంకర్ కి నాని లవ్ ప్రపోజ్..?

సినిమాలు తీయడమే కాదు ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి అన్నది నానిని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి అనిపించేలా అతని ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   26 April 2025 9:16 PM IST
కన్నడ యాంకర్ కి నాని లవ్ ప్రపోజ్..?
X

సినిమాలు తీయడమే కాదు ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి అన్నది నానిని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి అనిపించేలా అతని ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉన్నాయి. నాని లేటెస్ట్ సినిమా హిట్ 3 మరో ఐదు రోజుల్లో రాబోతుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయగా నాని వరుస ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు. నానితో పాటు హిట్ 3 హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా ఈ ప్రమోషన్స్ తో యాక్టివ్ గా పాల్గొంటుంది. ఐతే కన్నడలో నాని హిట్ 3 ప్రమోషన్స్ లో శ్రీనిధి అతనికి హెల్ప్ చేసింది.

అంతేకాదు అక్కడ యాంకర్ నానిని ప్రపోజ్ చేయమని అడిగితే శ్రీనిధి హెల్ప్ తీసుకుని మరీ కన్నడలో ఆమెకు ప్రపోజ్ చేశాడు నాని. ఇదంతా కూడా కన్నడ ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తుంది. నాని ఎక్కడ ప్రమోషన్స్ కి వెళ్లినా అక్కడ అతనికి మంచి వెల్కం లభిస్తుంది. అంతేకాదు నాని చేసే సినిమాలు కూడా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా నాని చేసే ఈ ప్రమోషన్స్ గురించి కూడా అందరు మాట్లాడుకునేలా చేస్తున్నాడు. నాని సినిమా పూర్తి చేసే వరకు ఎంత ఎనర్జీతో చేస్తాడో రిలీజ్ లాస్ట్ మినిట్ వరకు అదే రేంజ్ ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటాడు. అందుకే అతని కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. హిట్ 3 సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా కాబట్టి సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాని.

ఈమధ్యనే తన నిర్మాణంలో వచ్చిన కోర్ట్ సినిమా ని సూపర్ హిట్ చేసుకున్న నాని హిట్ 3 తో మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఐతే నాని హిట్ 3 సినిమా రోజే తమిళ్ హీరో సూర్య రెట్రో రిలీజ్ అవుతుంది. ఆ సినిమాను తెలుగులో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో ఈ రెండు సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఐతే నాని ఫ్యాన్స్ మాత్రం హిట్ 3 బాక్సాఫీస్ హంగామాకి సిద్ధం అవుతున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకులను అలరిస్తుంది.. ఏ సినిమా విజయ పతాకాన్ని ఎగురవేస్తుంది అన్నది చూడాలి.