హిట్3.. నాని మాటిచ్చేశాడు!
హిట్3 ప్రమోషన్స్ లో ఆఖరిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా నిర్వహించాడు నాని.
By: Tupaki Desk | 28 April 2025 5:06 AMశైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని చేసిన హిట్3 సినిమా మే 1వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కు నాని అన్ని నగరాలకు తిరుగుతూ సినిమాను తెగ ప్రమోట్ చేసి హిట్3 పై హైప్ ను బాగా పెంచాడు. ఆ హైప్ వల్లే ఎప్పుడెప్పుడు అర్జున్ సర్కార్ ను స్క్రీన్ పై చూస్తామా? అతనెంత వయొలెంట్ గా కనిపిస్తాడా అని చూడ్డానికి ఆడియన్స్ కూడా తెగ వెయిట్ చేస్తున్నారు.
హిట్3 ప్రమోషన్స్ లో ఆఖరిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా నిర్వహించాడు నాని. ఈ ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళిని చీఫ్ గెస్టుగా తీసుకొచ్చిన నాని, హిట్ యూనివర్స్ లోని హీరోలైన విశ్వక్ సేన్, అడివిశేష్ ను కూడా ఈవెంట్ కు హాజరయ్యేలా చేసి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేశాడు. ఈగ సినిమా టైమ్ నుంచే నానికి, రాజమౌళికి మధ్య మంచి బాండింగ్ ఉంది.
తనకు, రాజమౌళికి పర్సనల్ గా చాలా మంచి బాండింగ్ ఉందని, దానికి గల కారణం సినిమాపై ఇద్దరికీ అమితమైన ప్రేమ ఉండటమేనని చెప్పిన నాని, హిట్3 లో ఒక హై మూమెంట్ ఉంటుందని, దాని గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా రాజమౌళి మూమెంట్ అని మాట్లాడుకుంటామని, ఏ సినిమాలో అయినా హై ఇచ్చే మూమెంట్ ఉంటే దాన్ని రాజమౌళి మూమెంట్ అని ఆడియన్స్ పిలుచుకుంటారని నాని ఈ సందర్భంగా చెప్పాడు.
మామూలుగా రాజమౌళి ఐమ్యాక్స్ కు వెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి రివ్యూ ఇస్తూ ఉంటారు. గత కొన్నాళ్లుగా అది మిస్ అవుతుంది. మే 1న హిట్3 చూసి తనకు రివ్యూ ఇవ్వాలని కోరిన నాని, ఆ టైమ్ లో రాజమౌళి ఏదైనా టూర్ ప్లాన్ చేసుకుంటే ఆయన పాస్ పోర్ట్ లాక్కోవడానికి కూడా తాను రెడీ అని చెప్పి అందరినీ నవ్వించాడు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ నాని హిట్3 పై తన నమ్మకాన్ని చాలా బలంగా చెప్పాడు.
నా వెనుక రాజమౌళి ఉన్నారు. ముందు మీరున్నారు. కడుపులో తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదముంది. ఆల్రెడీ మధ్యాహ్నం సినిమా చూశా. హిట్3 సినిమాతో మీ అందరికీ అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తానని మీ నాని మీకు మాటిస్తున్నాడని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు నాని. ఇదే మాటను కళ్యాణ్ గారి స్టైల్ లో చెప్పాలంటే మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ నాని అన్నాడు. నాని కాన్ఫిడెన్స్ చూస్తుంటే హిట్3 తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించేలానే ఉన్నాడు.