Begin typing your search above and press return to search.

అప్పుడు అలా అన్న వాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాత‌గా కూడా మంచి స‌క్సెస్ లో ఉన్నాడు. కోర్టు, హిట్3 సినిమాల‌తో నిర్మాత‌గా త‌క్కువ టైమ్ లో వ‌రుస స‌క్సెస్‌లు అందుకున్న నాని, ఏం చేసినా దాని గురించి ఎంతో ఆలోచించే అడుగు ముందుకేస్తాడు.

By:  Tupaki Desk   |   24 May 2025 3:28 PM IST
Nani’s Smart OTT Release Strategy for Hit 3
X

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాత‌గా కూడా మంచి స‌క్సెస్ లో ఉన్నాడు. కోర్టు, హిట్3 సినిమాల‌తో నిర్మాత‌గా త‌క్కువ టైమ్ లో వ‌రుస స‌క్సెస్‌లు అందుకున్న నాని, ఏం చేసినా దాని గురించి ఎంతో ఆలోచించే అడుగు ముందుకేస్తాడు. ఈ విష‌యం ఇప్పుడు మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో నాని న‌టిస్తూ నిర్మించిన హిట్3 సినిమా నార్త్ లో కేవ‌లం సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే రిలీజైంద‌నే విష‌యం తెలిసిందే.

ఈ విష‌యంలో రిలీజ్ టైమ్ లో నాని కొన్ని విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నాడు. అయితే నార్త్ లో ఏదైనా సినిమాను మ‌ల్టీప్లెక్స్ లో రిలీజ్ చేయాలంటే ఓటీటీ రిలీజ్ క‌నీసం 50 రోజుల త‌ర్వాతే ఉండాల‌నేది అక్క‌డి రూల్. దానికి స‌ద‌రు నిర్మాత ఒప్పుకుంటేనే మ‌ల్టీప్లెక్సుల్లో సినిమాలు ఆడ‌తాయి. లేదంటే ఆడవు. హిట్3 సినిమా విష‌యంలో నాని ఆ రూల్ కు నో చెప్పి నెట్‌ఫ్లిక్స్ తో 28 రోజుల స్ట్రీమింగ్ కు డీల్ కుదుర్చుకుని, నార్త్ లో కేవ‌లం సింగిల్ స్క్రీన్ రిలీజ్‌నే ప్లాన్ చేసుకున్నాడు.

హిట్3 రిలీజ‌య్యాక తెలుగు రాష్ట్రాల్లో మిక్డ్స్ టాక్ తో మొద‌లై మంచి లాభాల‌నే తెచ్చిపెట్టింది. కానీ నార్త్ లో మాత్రం హిట్3 మంచి ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయింది. ఇప్పుడు మే 29న హిట్3 నెట్‌ఫ్లిక్స్ లోకి వ‌చ్చేస్తుంది. ఇదంతా చూస్తుంటే నాని హిట్3 ఓటీటీ విష‌యంలో తీసుకున్న డెసిష‌నే క‌రెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నార్త్ ఆడియ‌న్స్ కు హిట్3 పెద్ద‌గా ఎక్క‌లేదు.

వారిని న‌మ్ముకుని మల్టీప్లెక్సుల డీల్ కు ఒప్పుకుని ఉంటే నెట్‌ఫ్లిక్స్ హిట్3 కోసం నానికి ఆఫ‌ర్ చేసిన మొత్తం రేటులో భారీ కోత ప‌డేది. దీంతో నాని న‌ష్ట‌పోయేవాడు. అయితే ఇప్పుడు విష‌యం తెలుసుకున్న అంద‌రూ నానిని ఈ విష‌యంలో మెచ్చుకుంటున్నారు. ఓ వైపు థియేట‌ర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ కు గ్యాప్ ఉండాల‌ని నిర్మాత‌ల‌కు ఎగ్జిబిట‌ర్లు డిమాండ్ చేస్తున్న టైమ్ లో నాని లాంటి నిర్మాత తీసుకున్న నిర్ణ‌యం వారిలో ఏమైనా మార్పును తీసుకొస్తుందేమో చూడాలి. ఒక‌టి మాత్రం నిజం, మేక‌ర్స్ మంచి కంటెంట్ తో అల‌రించ‌గ‌లిగితేనే ఈ రోజుల్లో ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు త‌ప్పించి లేదంటే ఎంత స్టార్ క్యాస్టింగ్ ఉన్నా, ఎంత భారీ బ‌డ్జెట్ సినిమా అయినా దాన్ని చూడాల‌నుకోవ‌డం లేదు మ‌న ప్రేక్ష‌కులు.