Begin typing your search above and press return to search.

టైర్ కాన్సెప్ట్.. నాని ఇచ్చి పడేశాడుగా!

దీంతో నాని అది మనం క్రియేట్‌ చేసుకున్న పదమేనని తెలిపారు. హీరోకు తగ్గట్టు సినిమాలు తెరకెక్కుతాయని అన్నారు.

By:  Tupaki Desk   |   15 April 2025 7:00 PM IST
టైర్ కాన్సెప్ట్.. నాని ఇచ్చి పడేశాడుగా!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టైర్ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసిందే. టైర్-1, టైర్-2, టైర్-3.. అంటూ హీరోలను డివైడ్ చేశారు సినీ ప్రియులు, అభిమానులు. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేసే కథానాయకులను టైర్-1 హీరోలుగా పిలుస్తున్నారు. ఆ తర్వాత రేంజ్ బడ్జెట్ తో మూవీలు చేసేవాళ్లను టైర్-2 అంటున్నారు. మిగతా వారిని టైర్-3 అని చెబుతున్నారు.

అయితే టైర్ కాన్సెప్ట్.. సోషల్ మీడియాలోనే పుట్టుకొచ్చిందని చెప్పాలి. అదే సమయంలో నేచురల్ స్టార్ నాని టైర్-2 హీరోగా సినీ ప్రియులు, ఫ్యాన్స్ అభిప్రాయపడుతుంటారు. కొంతకాలంగా టైర్-1ను ఆయన టార్గెట్ చేసుకున్నారని చెబుతుంటారు. మరో రెండు మూడు సినిమాల తర్వాత ఆయన టైర్-1 హీరో అయిపోతారని అంటుంటారు.

కానీ నానికి మాత్రం టైర్ కాన్సెప్ట్ నచ్చడం లేదు. ఇప్పటికే పలుమార్లు పెదవి విరిచిన ఆయన.. రీసెంట్ గా మరోసారి ఆ విషయంపై స్పందించారు. హిట్-3 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మేకర్స్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో నానికి.. మీరు రూ. 100 కోట్ల క్లబ్‌ లో చేరిన హీరో.. టైర్‌ 1 జాబితాలో చేరినట్టేనా? అని ఓ విలేకరి ప్రశ్నించారు.

దీంతో నాని అది మనం క్రియేట్‌ చేసుకున్న పదమేనని తెలిపారు. హీరోకు తగ్గట్టు సినిమాలు తెరకెక్కుతాయని అన్నారు. కానీ నటులను ఆ పేర్లతో ఎందుకు సెపరేట్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అది స్టుపిడ్‌ కాన్సెప్ట్‌ గా వర్ణించారు. దాన్ని ఎవరు మొదలుపెట్టారో గానీ మనమంతా దాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

దాన్ని ఎప్పుడైతే ఆపుతామో అప్పుడే చిత్ర పరిశ్రమ బాగుంటుందని అన్నారు. అది బాగుంటే అందరం హ్యాపీగా ఉంటామని కూడా చెప్పారు. తానైతే ఇలాంటివి అస్సలు పట్టించుకోనని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు నాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనేక మంది నెటిజన్లు.. నాని కామెంట్స్ తో ఏకీభవిస్తున్నారు.

సోషల్ మీడియాలో టైర్ కాన్సెప్ట్ తో వార్స్ చేసుకుంటున్న ఫ్యాన్స్ కు నాని సరైన సమాధానం ఇచ్చారని చెబుతున్నారు. ఏదేమైనా నాని ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని అంటున్నారు. స్టుపిడ్‌ కాన్సెప్టేనని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలా నాని వ్యాఖ్యల తర్వాత టైర్ కాన్సెప్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.