నానితో సినిమాపై శేఖర్ కమ్ముల క్లారిటీ
మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని సినిమాలు హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంటున్నాయి.
By: Tupaki Desk | 19 Jun 2025 8:45 AM ISTమినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని సినిమాలు హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంటున్నాయి. రిలీజ్ కు ముందే నాని సినిమాలకు మంచి బిజినెస్‌లు జరిగి నిర్మాతలు సేఫ్ అవుతుండటంతో అతనితో సినిమాలు చేయడానికి ఎవరైనా రెడీగానే ఉంటున్నారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన నాని, టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో సినిమా చేయబోతున్నాడని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది.
అందులో భాగంగానే నానికి శేఖర్ కమ్ముల కథ కూడా చెప్పాడని అంటున్నారు. నానికి ఆల్రెడీ శేఖర్ ఓ సెన్సిబుల్ కథను చెప్పాడని, నానికి ఆ కథ నచ్చి ఓకే చెప్పినప్పటికీ ఆ స్క్రిప్ట్ ఫైనల్ దశకు చేరడానికి టైమ్ పడుతుందని వార్తలొచ్చాయి. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కలిసి పని చేయాలనుకుంటున్నప్పటికీ వారిద్దరి కమిట్‌మెంట్స్ వల్ల ఈ కాంబినేషన్ కుదరడం లేదు.
అయితే ఈ వార్తలపై తాజాగా కుబేర ప్రమోషన్స్ లో శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చాడు. నానితో తాను చేయాలనుకుంటున్న ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాకే ఆ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలను వెల్లడించగలనని శేఖర్ కమ్ముల తెలిపారు. దీంతో నాని- శేఖర్ కమ్ముల ప్రాజెక్టు కన్ఫర్మ్ అని ఫిక్సైపోవచ్చు. కాకపోతే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందంటున్నారు కాబట్టి చాలా టైమ్ పట్టే అవకాశాలున్నాయి.
నాని- శేఖర్ కమ్ముల సినిమాను కూడా ఏషియన్ సునీల్ నిర్మించనున్నట్టు సమాచారం. లవ్ స్టోరీ, ఫిదా తరహా శేఖర్ కమ్ముల తన స్టైల్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని అంటున్నారు. ఏదేమైనా స్వయంగా శేఖర్ కమ్ములనే ఈ సినిమాకు టైమ్ పడుతుందని చెప్పాడంటే వెంటనే ఉండే ఛాన్స్ లేదు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో తీసిన కుబేర రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. జూన్ 20న రిలీజ్ కానున్న కుబేర సినిమాపై టీమ్ మొత్తం ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది.
