మారువేషంలో కూలీ, వార్ 2 చిత్రాలు చూసిన స్టార్ హీరో.. ఎవరంటే?
సినీ సెలబ్రిటీలకు మామూలు జనాలు మాత్రమే అభిమానులుగా ఉండరు. సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది హీరోలు అభిమానులుగా ఉంటారు.
By: Madhu Reddy | 15 Aug 2025 11:05 AM ISTసినీ సెలబ్రిటీలకు మామూలు జనాలు మాత్రమే అభిమానులుగా ఉండరు. సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది హీరోలు అభిమానులుగా ఉంటారు. అలా ఇప్పటికే మన ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది హీరోలకు హీరోలే అభిమానులుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఆ అభిమాన హీరోల సినిమాలు థియేటర్లో విడుదలైతే సినిమాలు చూడడం కోసం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు బయట జనాలు చూసి గుర్తుపట్టకూడదు అనే ఉద్దేశంతో దొంగతనానికి వెళ్ళిన వాళ్ళలా ముసుగులు వేసుకొని మరీ తమ అభిమాన హీరోల సినిమాలు చూస్తూ ఉంటారు.
అలా తాజాగా టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో కూడా రహస్యంగా వెళ్లి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను చూసి సైలెంట్ గా వచ్చేసారు.. మరి ఇంతకీ ఇద్దరు హీరోల సినిమాలు ముసుగు వేసుకొని మరీ చూసి వచ్చిన ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు బిగ్గెస్ట్ సినిమాలు విడుదలయ్యాయి. అవే వార్-2, కూలీ.. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన వార్-2 అలాగే కోలీవుడ్ నటుడు రజినీకాంత్ ,టాలీవుడ్ నటుడు నాగార్జున కాంబోలో వచ్చిన మూవీ కూలీ..ఈ రెండు సినిమాలు ఒకేరోజు అనగా ఆగస్టు 14న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలు అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ము దులిపేసాయి. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ చాలామంది జనాలు సినిమా చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ హీరో కూడా కూలీ, వార్-2 రెండు సినిమాలను మారువేషంలో దొంగ చాటుగా వెళ్లి చూశారు.
ఇక ఆ హీరో ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని.. హీరో నాని వార్-2, కూలీ రెండు మూవీస్ ని ఒకేసారి కవర్ చేశారు.. ప్రస్తుతం నాని మహేష్ బాబు ఏఎంబి థియేటర్స్ లో సినిమా చూసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నేచురల్ స్టార్ నాని తన మొహాన్ని పూర్తిగా కవర్ చేసుకొని థియేటర్ కి వెళ్లి వార్-2, కూలీ రెండు సినిమాలను చూసి సింపుల్గా బయటకి వచ్చేసారు. అయితే సినిమా చూడడానికి వెళ్ళిన నానిని గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే మొహం నిండా మాస్క్ వేసుకొని పూర్తిగా కవర్ చేసేసారు. కానీ ఎంత రహస్యంగా వెళ్లాలనుకున్నా సెలబ్రిటీలు ఎక్కడో ఒకచోట బయట పడుతూనే ఉంటారు. అలా తాజాగా నాని వార్-2, కూలీ రెండు సినిమాలను చూడడానికి థియేటర్ కి వెళ్లిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది.
దీంతో నానికి ఈ హీరోల మీద ఎంత అభిమానం ఉంటే ముసుగు వేసుకొని మరీ రెండు సినిమాలు చూస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక హీరోల సినిమాలు విడుదలయితే మిగతా హీరోలు, హీరోయిన్లు ముసుగు వేసుకొని సినిమా థియేటర్లలో చూడడం ఇది మొదటిసారేం కాదు. ఇప్పటికే చాలామంది నటీనటులు తమ అభిమాన నటీనటుల సినిమాలు విడుదలైనప్పుడు మొహం మొత్తం కవర్ అయ్యేలా ముసుగులు వేసుకొని సినిమాలు చూసి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.. ప్రస్తుతం నాని కూడా అలాగే చేశారు.
