నానికి నచ్చిన తమిళ సినిమా ఏంటో తెలుసా?
ఇదిలా ఉంటే ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం నాని తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్స్ హోరెత్తిస్తున్నారు.
By: Tupaki Desk | 27 April 2025 2:00 AM ISTనేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా `హిట్ ద థర్డ్ కేస్`. డా. శైలేలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. హిట్ ఫ్రాంఛైజీలో వస్తున్న థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇది. రెండు సినిమాలు పేరుకు తగ్గట్టే హిట్ కావడం, హిట్ 3లో నాని రూత్‌లెస్ కాప్‌గా నటించడంతో ఈ మూవీపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో సినిమా ఉంటుందని టీజర్, ట్రైలర్ నిరూపించాయి.
అంటే కాకుండా నాని కూడా సినిమాపై భరోసా ఇవ్వడంతో హిట్ 3పై ప్రేక్షకుల్లో అంచనాలు తాజా స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే ఇండియాలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం నాని తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్స్ హోరెత్తిస్తున్నారు.
త్వరలో అమెరికాలో ప్రమోషన్స్ చేయనున్న నాని ఇప్పుడు హిట్ 3 ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లారు. నానితోపాటు హీరోయిన్ శ్రీనిధిశెట్టి కూడా ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లింది. అక్కడ ఇద్దరికి ఓ ప్రశ్న ఎదురైంది. రీసెంట్‌గా మీకు నచ్చిన తమిళ సినిమా ఏంటో చెప్పమని ఓ ప్రశ్న ఎదురైంది. శ్రీనిధిశెట్టి తనకు ఇటీవల విడుదలైన `రబ్బర్ పందు` అని ఠక్కున చెప్పేసింది. కానీ నాని మాత్రం తనకు భిన్నంగా సమాధానం చెప్పి ఆశ్చర్యపరిచాడు.
తమిళ సినిమాను మర్చిపో `మేయళగన్`(తెలుగులో సత్యం సుందరం) ఈ దశాబ్దంలో నాకు నచ్చిన సినిమా. ఇదొక అపూర్వమైన సినిమా. ఈ సినిమా నన్నెంతగానో ఉక్కిరిబిక్కిరి చేసింది. దర్శకుడు ప్రేమ్‌కుమార్ మ్యాజిక్‌చేశాడు. మీరు సెట్‌లు నిర్మించవచ్చు.. 1000 కోట్లు ఖర్చు చేయవచ్చు. అదంతా ప్రశంసించదగ్గది, గౌరవించదగ్గది. కానీ `మేయళగన్` మాత్రం ఓ స్వచ్ఛమైన మ్యాజిక్. ఈ సినిమాతో కార్తిపై చాలా గౌరవం ఏర్పడింది. అరవింద్‌స్వామి సర్, ప్రేమ్ ఈ మూవీతో మనకొక టైమ్ లెస్ క్లాసిక్‌ని అందించారు.
సినిమా చూసిన తరువాత కార్తీకి ఫోన్ చేసి అభినందించాను. `మేయళగన్` లాంటి సినిమా గురించి ఆలోచించినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. సూర్య నిర్మించిన ఈ సినిమా ప్రశంసల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది` అంటూ కార్తీ, అరవిందస్వామిల `మేయళగన్`పై నాని ప్రశంసల వర్షం కురిపించడం విశేషం.
