నాని డెసిషన్ మేకింగ్ అంటే ఇదే..!
నాని కాదన్న తర్వాత తమ్ముడు సినిమాలోకి నితిన్ వచ్చాడు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే రిజల్ట్ తేడా కొట్టేసింది.
By: Tupaki Desk | 6 July 2025 3:00 AM ISTన్యాచురల్ స్టార్ నాని సినిమాల విషయంలో పర్ఫెక్ట్ డెసిషన్ మేకింగ్ ఉంటుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. రీసెంట్ గా రిలీజైన నితిన్ తమ్ముడు సినిమాను డైరెక్టర్ శ్రీరామ్ వేణు ముందు నానికే వినిపించాడట. ఐతే నాని ఇతర సినిమాల కమిట్ మెంట్ వల్ల ఆ ప్రాజెక్ట్ వదులుకోవాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. ఐతే నాని నిజంగానే సినిమాల బిజీ వల్ల వదులుకున్నాడా లేదా మరో కారణం ఏదైనా ఉందా అన్నది విశ్లేషిస్తున్నారు.
నానితో శ్రీరాం వేణు ఆల్రెడీ M.C.A సినిమా చేశాడు. ఆ డైరెక్టర్ మీద నమ్మకం ఉంటుంది. కానీ ఈసారి తమ్ముడు కథను స్పెషల్ గా ఒక పూట మాత్రమే నడిచే కథనంగా.. పక్కా గ్రిప్పింగ్ తో తీయాల్సి ఉంటుంది. బహుశా నాని ఇక్కడే డైరెక్టర్ మీద అంత కాన్ఫిడెంట్ గా ఉండకపోవచ్చు. దానివల్లే సినిమా ఓకే చేసుండక పోవచ్చని చెప్పుకుంటున్నారు.
నాని కాదన్న తర్వాత తమ్ముడు సినిమాలోకి నితిన్ వచ్చాడు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే రిజల్ట్ తేడా కొట్టేసింది. ఐతే కథ చెప్పినప్పుడు నానికి నచ్చినా డేట్స్ అడ్జెస్ట్ కాకనే ఈ ప్రాజెక్ట్ వదులుకున్నాడని చెప్పినా సినిమా ఫలితం చూసి ఇది వర్క్ అవుట్ కాదని నాని కావాలనే వదులుకున్నాడని అంటున్నారు.
మరి వీటిలో ఏది నిజం.. ఏది వాస్తవం అన్నది పక్కన పెడితే నాని కావాలని అలా చేసినా.. లేదా యాదృశ్చికంగా జరిగినా సరే నాని డెసిషన్ మేకింగ్ ని సూపర్ అనేస్తున్నారు ఆడియన్స్. నాని కి కథ నచ్చింది కానీ ఆయన చేయడం కుదరట్లేదు అని నితిన్ టేకప్ చేశాడు. చూస్తే అతని శ్రమ.. సినిమా కోసం పడిన కష్టం అంతా వృధా అయ్యింది.
సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ లో దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా తమ్ముడు ఆడియన్స్ ని అలరిస్తుందని అన్నారు. కానీ రిజల్ట్ చూసి దిల్ రాజు డెసిషన్ మేకింగ్ లో కూడా మార్పులు చేసుకోవాలని ప్రూవ్ అయ్యింది. నాని తమ్ముడు చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అతను కాదనడం నితిన్ చేయడం సినిమా ఇలా నిరాశ పరచడం చూసి షాక్ అవుతున్నారు. తమ్ముడు ఫలితం ఇలా ఉంటే నితిన్ తో దిల్ రాజు నెక్స్ట్ ఎల్లమ్మ అంటూ మరో భారీ సినిమా చేస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమా ఎఫెక్ట్ దాని మీద కూడా పడే ఛాన్స్ లేకపోలేదు.