నాని గ్యాప్ ఇచ్చేదే లేదట..!
హిట్ 3 సినిమా విడుదల కాకుండానే నాని తదుపరి సినిమా విషయమై క్లారిటీ వచ్చింది.
By: Tupaki Desk | 1 May 2025 2:00 AM ISTనేచురల్ స్టార్ నాని మే 1న 'హిట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను ప్రమోట్ చేయడం కోసం దేశం మొత్తం నాని హిట్ 3 టీం తో చక్కర్లు కొడుతున్నాడు. త్వరలోనే యూఎస్‌కి నాని అండ్ టీం వెళ్లే అవకాశాలు ఉన్నాయి. హిట్ 3 పై నాని చాలా నమ్మకం గా కనిపిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ 3 లో నానికి జోడీగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించింది. హిట్ ప్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హిట్ 3 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.
హిట్ 3 సినిమా విడుదల కాకుండానే నాని తదుపరి సినిమా విషయమై క్లారిటీ వచ్చింది. కొన్ని నెలల క్రితమే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' ను నాని ప్రకటించిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే దసరా సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే పాన్ ఇండియా మార్కెట్‌లో మాత్రం దసరా సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఈసారి ది ప్యారడైజ్ సినిమాతో నార్త్ ఇండియాలోనూ సత్తా చాటాలని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు అయ్యాయి. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
ఎట్టకేలకు ది ప్యారడైజ్ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు శ్రీకాంత్ ఓదెల సిద్ధం అయ్యాడు. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మే మొదటి వారంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది. నాని హిట్ 3 సినిమా ప్రమోషన్స్‌లో ఉండనున్న కారణంగా ది ప్యారడైజ్ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొనే అవకాశం లేదు. నాని లేకుండానే మొదటి షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. నాని లేని సీన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేశాడట. మే చివరి వారం నుంచి నాని అందుబాటులో ఉంటాడని సమాచారం అందుతోంది. హిట్ 3 సినిమా ప్రమోషన్స్ కోసం రెండు వారాలుగా బిజీ బిజీగా నాని మీడియా సమావేశాల్లో, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. హిట్ 3 ప్రమోషన్స్ పూర్తి కాగానే గ్యాప్ ఇవ్వకుండా ది ప్యారడైజ్ సినిమాను నాని చేయబోతున్నాడు.
నాని దసరా సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించాడు. ఇప్పుడు అంతకు మించిన విభిన్నమైన పాత్రలో ది ప్యారడైజ్ సినిమాలో కనిపించబోతున్నాడు. అంతే కాకుండా వైల్డ్ పాత్రలో నానిని శ్రీకాంత్ ఓదెల చూపించబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు, గ్లిమ్స్ వీడియోలోని డైలాగ్స్ చూస్తూ ఉంటే నాని, శ్రీకాంత్ ఓదెలల 'యానిమల్' అనే టాక్ వినిపిస్తుంది. యానిమల్ రేంజ్ వైల్డ్ సీన్స్‌తో పాటు, కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా సినిమాలో ఉండబోతున్నట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి హిట్ 3 సినిమా మాదిరిగానే ది ప్యారడైజ్ సినిమా కూడా పిల్లలు చూడలేనంత హింసాత్మకంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. నాని అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
