ప్రొడ్యూసర్ నాని నెక్స్ట్ ప్లాన్ ఏంటి..?
ఐతే నెక్స్ట్ ప్రొడ్యూసర్ నాని ఎలాంటి సినిమా చేస్తాడు. ఎవరి కథలను వింటున్నాడు. తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.
By: Tupaki Desk | 9 July 2025 8:45 AM ISTన్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా మంచి ఫాం కొనసాగిస్తున్నాడు. నాని ఏ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నా అది మంచి సక్సెస్ అవుతుంది. హీరోగానే కాదు నిర్మాతగా తన టేస్ట్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు నాని. ఈమధ్యనే కోర్ట్, హిట్ 3 సినిమాలతో నాని సక్సెస్ అందుకున్నాడు. హిట్ ఫ్రాంచైజీలు కూడా తన బ్యానర్ లోనే తీస్తున్నాడు నాని. ఐతే కోర్ట్ సినిమా తర్వాత హిట్ 3 పడటంతో హీరో నాని కన్నా నిర్మాత నాని ఎక్కువ లాభ పడ్డాడు.
ఐతే నెక్స్ట్ ప్రొడ్యూసర్ నాని ఎలాంటి సినిమా చేస్తాడు. ఎవరి కథలను వింటున్నాడు. తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. చిన్నగా నాని హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గా కూడా తనకంటూ ఒక బ్రాండ్ ని ఏర్పరచుకుంటున్నాడు. అందుకే నాని నిర్మాణంలో సినిమా చేయడానికి కూడా దర్శకులు ఆసక్తిగా ఉన్నారు.
లిమిటెడ్ బడ్జెట్ లో మంచి కంటెంట్ తో నాని నిర్మాతగా చేస్తున్న సినిమాలు అతనికి మంచి ఫలితాలు అందిస్తున్నాయి. ఐతే నాని నిర్మాతగా కన్నా ఒక ఆడియన్ గా కథను వింటాడు కాబట్టే తన జడ్జిమెంట్ అంత పర్ఫెక్ట్ గా కుదురుతుందని తెలుస్తుంది. అ! సినిమాతో నాని నిర్మాతగా ప్రయత్నం మొదలు పెట్టాడు. కోర్ట్, హిట్ 3 తో వరుస సక్సెస్ లను అందుకున్నాడు.
నిరాతగా నాని సక్సెస్ మేనియాని కొనసాగించేలా కొత్త కథ దొరకాలి. ఆ తర్వాత ఆ సినిమాకు నాని తన మార్క్ టచ్ ఇచ్చి దానికి మంచి లిఫ్ట్ ఇస్తాడు. అంతేకాదు కథకు తగిన కాస్టింగ్ మిగతా క్రూ సెలెక్షన్ లో కూడా నాని తన తెలివి ప్రదర్శిస్తాడు. అందుకే నాని ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని ప్రొడ్యూస్ చేసే స్థాయికి వెళ్లాడు. నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో చిరంజీవితో ఒక సినిమా రాబోతుంది. ఐతే దాని కన్నా ముందు మరో చిన్న సినిమా ఒకటి ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. ఐతే దాని డీటైల్స్ ఇంకా బయటకు రాలేదు. ఇక నాని నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రీకాంత్ తోనే ప్యారడైజ్ సినిమా చేస్తున్న నాని నెక్స్ట్ సుజిత్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు.
