విష్ణు కొత్త మూవీ.. నాని బిగ్ బూస్ట్..
ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని చేసిన ప్రత్యేక ప్రశంసలు సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి.
By: M Prashanth | 5 March 2026 4:34 PM ISTటాలీవుడ్ లో విభిన్న కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు మరోసారి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్ విడుదలకు ముందే మంచి బజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని చేసిన ప్రత్యేక ప్రశంసలు సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి.
సినిమా ప్రీ వ్యూ చూసిన నాని సోషల్ మీడియా రెస్పాండ్ అయ్యారు. "మృత్యుంజయ్ మూవీని మొదటి నుంచి చివరి వరకు చూస్తూ ఉండిపోయాను. శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ తో ఫన్ రోల్స్ లో ఎంత బాగా నటిస్తారో అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా మాత్రం సర్ప్రైజ్. చాలా బాగా చేశారు. తొలి నిర్మాణంతో కొత్తదనాన్ని ఎంచుకున్న నిర్మాత సందీప్ గుణ్ణంకు అభినందనలు. టీమ్ కు ఆల్ ది బెస్ట్" అంటూ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం నేచురల్ స్టార్ పోస్ట్.. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. నాని వంటి స్టార్ హీరో నుంచి వచ్చిన ప్రశంసలు చిత్ర బృందానికి పెద్ద బూస్ట్ ఇచ్చినట్లేనని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నాని పోస్ట్ చూస్తుంటే.. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనిపిస్తుందని పలువురు సినీ ప్రియులు చెబుతున్నారు.
ఇక మూవీ విషయానికొస్తే.. మృత్యుంజయ్ సినిమాను దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తుండగా, లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్, ఎమోషనల్ టచ్.. అన్నీ కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని మేకర్స్ చెబుతున్నారు.
ఇప్పటికే సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శ్రీ విష్ణు- రెబా మోనికా జాన్ జంట మరోసారి మృత్యుంజయ్ లో కలిసి నటిస్తోంది. ఆ హిట్ పెయిర్ మళ్లీ స్క్రీన్ పై కనిపించనుండటంతో ఫ్యాన్స్ లో అంచనాలు మరింత పెరిగాయి. కామెడీ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న శ్రీ విష్ణు ఈసారి సీరియస్, ఇంటెన్స్ పాత్రలో కనిపించడం విశేషం. అదే సమయంలో రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ ట్రైలర్ ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. సందీప్ తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, ఆయన తండ్రి గుణ్ణం గంగరాజులాగానే యూనిక్ కథలను ఎంపిక చేసుకుంటారని ప్రశంసించారు. ట్రైలర్ లో కనిపించిన సస్పెన్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ క్యూరియాసిటీ పెంచాయి. మొత్తానికి స్టార్ హీరోల సపోర్ట్, ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఆకట్టుకున్న ట్రైలర్.. అన్నీ కలిసి మృత్యుంజయ్ పై అందరిలో అంచనాలు పెంచాయి. మరి ఇంకొన్ని గంటల్లో రిలీజ్ కానున్న మృత్యుంజయ్ ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.
