నాని 'ప్యారడైజ్'.. మామూలు కౌంటర్ ఇవ్వలేదుగా..
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 3 April 2025 5:04 PM ISTటాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ప్యారడైజ్. దసరాతో మంచి హిట్ ను నానికి అందించిన శ్రీకాంత్ ఓదెల.. ప్యారడైజ్ కు దర్శకత్వం వహిస్తున్నారు. సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో సుధాకర్ చెరుకూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన రా స్టేట్ మెంట్ (వీడియో) వేరే లెవెల్ రెస్పాన్స్ అందుకుంది. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. సినిమాపై అంచనాలు పెంచేసింది. తిరుగుబాటు, నాయకత్వంతో పాటు తల్లీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో మూవీ తెరకెక్కిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది.
ముఖ్యంగా నానిని రెండు జళ్లతో చూపించిన తీరు ఆకర్షణగా నిలిచింది. నేచురల్ స్టార్ రా రస్టిక్ లుక్ అదిరిపోయింది. అయితే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ లాంటి విదేశీ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 26న సినిమా విడుదల కానుంది. ఆ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
కానీ కొద్ది రోజులుగా సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. స్క్రిప్ట్ విషయంలో నాని ఆసక్తిగా లేరని, బడ్జెట్ కూడా ఎక్కువ కావడం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో మూవీ టీమ్ రెస్పాండ్ అయింది. కాస్త ఘాటుగానే స్పందించింది. రూమర్స్ క్రియేట్ చేసే వారిని జోకర్స్ తో పోల్చింది.
ది ప్యారడైజ్ మూవీ వర్క్స్ అనుకున్న విధంగా జరుగుతున్నాయని మూవీ టీమ్ చెప్పింది. ఎంత గొప్పగా మూవీ రెడీ అవుతుందో త్వరలో చూద్దురు.. అప్పటి వరకు రూమర్స్ క్రియేట్ చేస్తూ బతకండని ఎద్దేవా చేసింది. గజరాజు నడుస్తుంటే గజ్జి కుక్కలు అరుస్తుంటాయి కదా! అంటూ సామెతను గుర్తు చేసింది. సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను గమనిస్తున్నామని చెప్పింది.
అదే సమయంలో రూమర్స్ క్రియేట్ చేసేవారిని కూడా అబ్జర్వ్ చేస్తున్నామని, వాటితో ఒక శక్తిగా ఎదుగుతామని తెలిపింది. టాలీవుడ్ గర్వించే సినిమాగా ప్యారడైజ్ ఉంటుందని చెప్పింది. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారంతా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. మంచి అవుట్ పుట్ తో వస్తామని, తామంతా మూవీ కోసం అంతా కష్టపడుతున్నట్లు వెల్లడించింది. ప్రేక్షకులను కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చింది. మరి ప్యారడైజ్ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
