Begin typing your search above and press return to search.

2026 నాని ప్లానింగ్ అదుర్స్..!

న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 తో సక్సెస్ అందుకుని కూల్ గా తన నెక్స్ట్ సినిమా ప్యారడైజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

By:  Tupaki Desk   |   21 July 2025 2:00 AM IST
2026 నాని ప్లానింగ్ అదుర్స్..!
X

న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 తో సక్సెస్ అందుకుని కూల్ గా తన నెక్స్ట్ సినిమా ప్యారడైజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల తో మరోసారి మాస్ రచ్చ కి సిద్ధమవుతున్నాడి నాని. ప్యారడైజ్ సినిమా 2026 మార్చి ఎండింగ్ రిలీజ్ లాక్ చేశారు. నాని సినిమా అంటే అనుకున్న టైం కి కచ్చితంగా పూర్తి చేసేలా ప్లానింగ్ ఉంటుంది. ఐతే నాని ప్యారడైజ్ మాత్రమే కాదు 2026 లో మరో సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నాడట.

నాని లైన్ లో డైరెక్టర్ సుజిత్ ఉన్నాడు. అతను పవర్ స్టార్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పూర్తి కాగానే నానితో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. నాని సుజిత్ కాంబో సినిమాను కూడా డివివి దానయ్య నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఓజీ చేస్తూనే సుజిత్ నాని సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చూస్తున్నారట.

సెప్టెంబర్ ఓజీ రిలీజ్ అవ్వడం ఆలస్యం త్వరగానే నాని సినిమా షూటింగ్ మొదలు పెడతారట. నాని, సుజిత్ కాంబో సినిమా ఆడియన్స్ కి ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమాగా వస్తుందని అంటున్నారు. నానితో సుజిత్ ఒక లవ్ స్టోరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్యారడైజ్ ఎలాగు షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుగుతుంది. సుజిత్ సినిమా కూడా అక్టోబర్ లో మొదలు పెట్టి ఏడాదిలో రిలీజ్ చెసేలా నాని ప్లానింగ్ ఉందట.

అంటే 2026 మార్చిలో ప్యారడైజ్ తో వస్తే.. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ అంటే అక్టోబర్ లేదా డిసెంబర్ కల్లా సుజిత్ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. నాని ఈమధ్య వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్నాడు. కచ్చితంగా నానికి రాబోతున్న రెండు సినిమాలు మంచి సక్సెస్ అందించేలా ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత నాని ఎవరితో చేస్తాడన్నది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఐతే ప్యారడైజ్ పూర్తయ్యే లోగా నాని సుజిత్ తర్వాత చేసే డైరెక్టర్ ఎవరన్నది క్లారిటీ వస్తుంది. ఫాం లో ఉన్న నాని ఏ డైరెక్టర్ తో పనిచేసినా అది సూపర్ గా వర్క్ అవుట్ అవుతుంది. ఐతే నాని నెక్స్ట్ కొత్త డైరెక్టర్ ని ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.