ప్యారడైజ్ లో నాని జాయిన్ అయ్యేదప్పుడే!
దీంతో ఒక్కసారిగా ది ప్యారడైజ్ సినిమాకు బిజినెస్ బాగా పెరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 16 April 2025 3:31 PM ISTనేచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హీరోగా హ్యాట్రిక్ హిట్లు అందుకున్న నాని రీసెంట్ గా కోర్టు సినిమాతో నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం నాని తన సొంత బ్యానర్ లో హిట్3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతన్న హిట్3 మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హిట్3 తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ చేయనున్న సంగతి తెలిసిందే. దసరా తర్వాత శ్రీకాంత్ దర్శకత్వంలో నాని చేయనున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్ మీద మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలను మరింత పెంచుతూ శ్రీకాంత్ ప్యారడైజ్ నుంచి రా స్టేట్‌మెంట్ ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాడు.
సినిమా ఎలా ఉండబోతుంది? అందులో నాని ఎంత రా అండ్ రస్టిక్ గా కనిపిస్తాడనేది అందులో చూపించాడు శ్రీకాంత్. గ్లింప్స్ లోని ఓ పదం, నాని చేతి మీద టాటూ, గ్లింప్స్ కు అనిరుధ్ ఇచ్చిన బీజీఎం సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. దీంతో ఒక్కసారిగా ది ప్యారడైజ్ సినిమాకు బిజినెస్ బాగా పెరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ మే 2 నుంచి మొదలుకానున్నట్టు తెలుస్తోంది. కానీ హీరో నాని మాత్రం మే 15 నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతాడట. ఈ లోగా శ్రీకాంత్, నాని లేని సన్నివేశాలను మిగిలిన ఆర్టిస్టులతో తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం హిట్3 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాని ఆ సినిమా రిలీజై హడావిడి తగ్గాక ప్యారడైజ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.
దసరా సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరినే ది ప్యారడైజ్ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందనున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓ కొత్త ప్రపంచాన్ని తయారు చేయబోతున్నాడని, ది ప్యారడైజ్ తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించే సినిమా అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలియచేసింది. ది ప్యారడైజ్ తర్వాత శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
