Begin typing your search above and press return to search.

ప్యారడైజ్ ఇంకాస్త భారీగా..!

న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా హిట్ 3 తో సూపర్ సెన్సేషన్ అనిపించుకున్నాడు. నాని కాన్ స్టంట్ హిట్ మేనియాతో సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు.

By:  Tupaki Desk   |   8 May 2025 5:07 PM
ప్యారడైజ్ ఇంకాస్త భారీగా..!
X

న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా హిట్ 3 తో సూపర్ సెన్సేషన్ అనిపించుకున్నాడు. నాని కాన్ స్టంట్ హిట్ మేనియాతో సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. హిట్ 3 సినిమా రిజల్ట్ దానికి సాక్ష్యం. హిట్ 1, 2 సినిమాలు కేవలం క్రైం థ్రిల్లర్ ఇష్టపడే ఆడియన్స్ మాత్రమే చూశారు. కానీ హిట్ 3 సినిమాను కామన్ ఆడియన్స్ కూడా చూసి ఆహా అనేశారు. వాళ్ల వళ్లే ఈ సినిమా అంత గ్రాండ్ సక్సెస్ అయ్యింది. థియేటర్లకు జనాలు రావట్లేదని కొందరు అంటుంటే వాళ్లకి నచ్చే సినిమా ఇస్తే ప్రేక్షకులు ఎందుకు థియేటర్లకు రారని నాని ప్రూవ్ చేశాడు.

హిట్ 3 తర్వాత నాని మరో మాస్ బొమ్మతో రాబోతున్నాడు. దసరా అంటూ తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈసారి ప్యారడైజ్ అంటూ మరో రా అండ్ రస్టిక్ సినిమాతో వస్తున్నాడు నాని. సినిమా అనౌన్స్ మెంట్ టీజర్ తోనే గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు. ముఖ్యంగా మొన్నటిదాకా పక్కింటి అబ్బాయి ఇమేజ్ తో కనిపించిన నాని ఎంచుకున్న పాత్ర కోసం అతను చేసే హార్డ్ వర్క్ తెర మీద కనిపిస్తుంది. అదే అతనికి సక్సెస్ ని అందిస్తుంది.

హిట్ 3 సినిమా సక్సెస్ లో నానినే ప్రధాన హైలెట్ గా చెప్పుకుంటారు. ఇక రాబోతున్న ప్యారడైజ్ సినిమాను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు హిట్ 3 ఇంపాక్ట్ ప్యారడైజ్ మీద ఉండనుంది. హిట్ 3 లాంటి సినిమాతోనే నాని 100 కోట్లు కొట్టాడు ప్యారడైజ్ దీన్ని మించి నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంటుంది. అందుకే ఆ సినిమా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారు.

నాని రేంజ్ పెరిగింది కాబట్టి ప్యారడైజ్ బడ్జెట్ ఇంకా విజువల్స్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు తెలుస్తుంది. ప్యారడైజ్ లో నాని లుక్, డైలాగ్ డెలివరీ పూర్తి క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్ అని తెలుస్తుంది. శ్రీకాంత్ ఓదెల మీద నమ్మకంతోనే నాని ఈ సినిమాను చేస్తున్నాడు. అయినా సరే సినిమా అంతా నాని దగ్గర ఉండి చూస్తాడు కాబట్టే అతనికి అంత మంచి సక్సెస్ రేట్ ఉంది. ప్యారడైజ్ తో నాని తన మార్కెట్ ని డబుల్ చేసుకోవాలని చూస్తున్నాడు. సినిమా ఫస్ట్ టీజర్ చూస్తే అది సాధ్యం అయ్యేలానే ఉంది.