Begin typing your search above and press return to search.

నాని ప్యారడైజ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి..? ఎప్పుడు..?

దసరాతో నానిలోని మాస్ యాంగిల్ ని ప్రజెంట్ చేసిన శ్రీకాంత్ ఓదెల ఈసారి దానికి మించి ప్యారడైజ్ లో చూపించబోతున్నాడు.

By:  Tupaki Desk   |   3 Jun 2025 2:00 AM IST
నాని ప్యారడైజ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి..? ఎప్పుడు..?
X

టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఈమధ్యనే హిట్ 3 తో మాస్ హిట్ కొట్టాడు నాని. శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన హిట్ 3 సినిమా కేవలం థ్రిల్లర్ ఆడియన్స్ ని మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ ని కూడా మెప్పించింది. నానికి ఉన్న ఫ్యాన్ బేస్ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా చేసింది. అందుకే సినిమా మంచి వసూళ్లతో విజయ దుందుంభి మోగించింది. ఇక నాని నెక్స్ట్ సినిమా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తుంది. ప్యారడైజ్ అంటూ రాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించింది.

దసరాతో నానిలోని మాస్ యాంగిల్ ని ప్రజెంట్ చేసిన శ్రీకాంత్ ఓదెల ఈసారి దానికి మించి ప్యారడైజ్ లో చూపించబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ప్యారడైజ్ రాబోతుంది. ఐతే ఈ సినిమాలో నాని క్యారెక్టరైజేషన్ కెరీర్ బెస్ట్ గా ఉంటుందని అంటున్నారు. నాని ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ ఒక లెక్క అయితే ప్యారడైజ్ లో మరో లెక్క అంటున్నారు. నాని ప్యారడైజ్ సినిమా నుంచి నెక్స్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు.

ప్యారడైజ్ ఫస్ట్ స్టేట్మెంట్ అంటూ వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ముఖ్యంగా సినిమా నేపథ్యం రా అండ్ రస్టిక్ మూవీగా వస్తుందన్న విషయాన్ని క్లారిటీగా చూపించారు. నాని జడలతో కనిపించడం కూడా ఫ్యాన్స్ ఊహలకు అందలేదు. శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ విషయంలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయట. ఇక సినిమాలో నటిస్తున్న మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది చూడాలి.

నాని ప్యారడైజ్ సినిమాను నెక్స్ట్ ఇయర్ మార్చి రిలీజ్ లాక్ చేశారు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు.. ప్రతినాయకుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారు లాంటి వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. నాని మాత్రం ప్యారడైజ్ తో చాలా పెద్ద ప్లానింగ్ లో ఉన్నాడని అర్ధమవుతుంది. దసరా సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో పెట్టాడు. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓజీ సినిమా పూర్తి కాగానే సుజిత్ నాని కాంబో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.