Begin typing your search above and press return to search.

'ప్యారడైజ్' మూవీ ఆడితే ఆ సినిమాలకు గిరాకీ పెరుగుతుందా...

దసర సినిమాతో సక్సెస్ఫుల్ మాస్ హీరోగా పేరు సంపాదించుకున్నప్పటికి ప్యారడైజ్ మూవీ హిట్ అయితేనే నాని మాస్ ప్రేక్షకులకు మరింత చేరువవుతాడు...

By:  Tupaki Desk   |   16 Sept 2026 2:00 PM IST
ప్యారడైజ్ మూవీ ఆడితే ఆ  సినిమాలకు గిరాకీ పెరుగుతుందా...
X

సినిమా ఇండస్ట్రీ అనగానే ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు నాని... ఆయన కెరియర్ లో వైవిధ్యభరితమైన సినిమాలు ఎన్ని చేసిన కూడా 'దసర' మూవీతోనే ఆయనకి మాస్ ఇమేజ్ వచ్చింది. ప్రస్తుతం దసర మూవీ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లోనే 'ప్యారడైజ్' మూవీ చేశాడు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి... మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్క్ ను అందుకున్న శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది... నేచురల్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన నాని ఫ్యామిలీ ఇమేజ్ నుంచి మాస్ ఇమేజ్ వైపు అడుగులు వేస్తున్నాడు. దసర సినిమాతో సక్సెస్ఫుల్ మాస్ హీరోగా పేరు సంపాదించుకున్నప్పటికి ప్యారడైజ్ మూవీ హిట్ అయితేనే నాని మాస్ ప్రేక్షకులకు మరింత చేరువవుతాడు...

ఇక ప్రస్తుతం ప్యారడైజ్ మూవీ యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా అత్యద్భుతంగా వచ్చిందని సినిమా పలు రికార్డులను సైతం బ్రేక్ చేయబోతుందంటూ దర్శకుడు కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి ప్యారడైజ్ లాంటి సినిమా ఆడితే ఇలాంటి డిఫరెంట్ సినిమాలు మరిన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే పిరియాడికల్ సబ్జెక్టులకు బోల్డ్ కంటెంట్ ని జోడించి మరి కొంతమంది పెద్ద హీరోలు కూడా ప్రయోగాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి... ఇప్పటికే ఈ సినిమా మీద 200 కోట్లకు పైన బడ్జెట్ అయితే కేటాయించారు. నాని సినిమాలు ఎంత బాగున్నా కూడా ఆయన 100 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టలేకపోతున్నాడు. ప్యారడైజ్ సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడతాడా? సినిమా ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ నాని ని ఆ క్యారెక్టర్ లో ఆడియన్ ఓన్ చేసుకోగలడా లేదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది.

ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్ లను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే నాని ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. థియేటర్లో సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఆ ఫీల్ కలిగితే సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ వచ్చే గా అవకాశం ఉంటుంది. కానీ నాని క్యారెక్టర్ లో గాని పర్ఫామెన్స్ లో గాని ఏమాత్రం తేడా కొట్టినా కూడా సినిమా మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశమైతే ఉంది. శ్రీకాంత్ ఓదెల అన్నింటిని చాలా బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. తను ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా సినిమా రిజల్ట్ మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి శ్రీకాంత్ దగ్గరుండి మరి ప్రతి చిన్న విషయాన్ని తనే చూసుకుంటూ సినిమాను నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడట...