ప్యారడైజ్ లో ఇద్దరు భామలు వీళ్లేనా?
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో `ప్యారడైజ్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 May 2025 9:00 PM ISTనేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో `ప్యారడైజ్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన `హిట్ 3` తో గ్రాండ్ విక్టరీ అందుకున్న నాని ప్యారడైజ్ షూట్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నాడు. భారీ మాస్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతుంది. ఇప్పటికే చిత్రం ఆన్ సెట్స్ కు వెళ్లింది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంత వరకూ బయటకు రాలేదు.
తాజాగా ఆ మ్యాటర్ లీకైంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మెయిన్ లీడ్ కు జాన్వీ కపూర్ ని ఎంపిక చేయాలని ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారుట. ప్రస్తుతం జాన్వీ టాప్ స్టార్లతోనే పనిచేస్తుంది. తొలి చిత్రం `దేవర`లో ఎన్టీఆర్ సరసన నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన `పెద్ది`లో నటిస్తుంది. ఇద్దరు టాప్ హీరోలు. నాని ఇంకా టాప్ లీగ్ లో చేరలేదు. ఈ నేపథ్యంలో నానికి జోడీగా జాన్వీ ఒప్పుకుం టుందా? లేదా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
`పెద్ది` తర్వాత జాన్వీ తెలుగు సినిమా పై క్లారిటీ రాలేదు. పెద్దితో పాటు హిందీ సినిమాలకు పని చేస్తోంది. నానితో గనుక షురూ చేస్తే తిరుగుండదు. టైర్ 2 హీరోలతోనూ నటించడానికి జాన్వీ సిద్దంగా ఉందనే విషయం ఇండస్ట్రీలోకి వెళ్తుంది. నటిగా మరింత బిజీ అవుతుంది. అలాగే ఇదే సినిమాలో సెకెండ్ లీడ్ కు `డ్రాగన్` లో నటించిన కయాదు లోహార్ ను ఎంపిక చేసినట్లు వినిపిస్తుంది.
ఇందులో కయాదు రోల్ బోల్డ్ గా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. `డ్రాగన్` లోనూ కయాదు లోహార్ హాట్ అప్పిరియన్స్ తో అలరించిన సంగతి తెలిసిందే. ఒక్క చిత్రంతోనే ప్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉందని నిరూపించింది.
