ప్యారడైజ్ దసరా గిఫ్ట్ కోసమే..?
న్యాచురల్ స్టార్ నాని ప్యారడైజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మిగతా కాస్టింగ్ ఎవరన్నది ఇంకా వెల్లడించలేదు.
By: Tupaki Desk | 27 July 2025 9:00 PM ISTన్యాచురల్ స్టార్ నాని ప్యారడైజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మిగతా కాస్టింగ్ ఎవరన్నది ఇంకా వెల్లడించలేదు. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్యారడైజ్ ఫస్ట్ స్టేట్మెంట్ తోనే నాని సర్ ప్రైజ్ చేశాడు. తన రా అండ్ మాస్ స్టేట్మెంట్ తో సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు నాని. ఐతే ఫస్ట్ టీజర్ అదిరిపోగా సినిమాపై అంచనాలు కూడా భారీగా పెంచింది.
దసరాకి ప్యారడైజ్ అప్డేట్..
ఐతే ప్యారడైజ్ సినిమా రెండో టీజర్ ఎప్పుడని ఫ్యాన్స్ అడుగుతున్నారు. దసరాకి ప్యారడైజ్ నుంచి ఏదైనా అప్డేట్ ఉండొచ్చా అనే చర్చ నడుస్తుంది. సినిమాను నెక్స్ట్ మార్చి రిలీజ్ లాక్ చేశాడు నాని. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్ కి సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. నాని ప్యారడైజ్ లో కథానాయిక ఎవరన్నది ఇంకా తెలియలేదు. అసలు ఎవరిని తీసుకోవాలని అనుకుంటున్నారన్న క్లూ కూడా బయటకు రాలేదు.
ప్యారడైజ్ సినిమాలో నాని సర్ ప్రైజ్ రోల్ లో కనిపిస్తాడట. ఫస్ట్ టీజర్ తోనే రెండు జడలతో నాని ఇచ్చిన షాక్ తెలిసిందే. అంతేకాదు సినిమా ఎంత ఒరిజినల్ గా ఉంటుందో అందులోని డైలాగ్స్ కూడా అదే రేంజ్ లో ఉండేలా ఉన్నాయి. సెన్సార్ కి ఈ సినిమా బాగా పనిచెప్పేలా ఉందని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది.
పాన్ ఇండియా స్టార్..
ప్యారడైజ్ సినిమా దసరా గిఫ్ట్ కోసమే నాని అంతా రెడీ చేస్తున్నాడట. ఈసారి టీజర్ లో మరింత వైల్డ్ గా క్రేజీగా ప్లాన్ చేస్తున్నాడట నాని. శ్రీకాంత్ ఈ సినిమాతో కచ్చితంగా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారతాడని అంటున్నారు. ఈ సినిమా పూర్తి చేసి నాని సుజిత్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు.
నాని ప్యారడైజ్ సినిమా షూటింగ్ అంతా కూడా చాలా సీక్రెట్ గా చేస్తున్నారట. సినిమాలో యాక్షన్ ఘట్టాలు కూడా సంథింగ్ స్పెషల్ అనిపిస్తాయట. తెలుగు తెర మీద ఇదివరకు ఎప్పుడు చూడని ఒక కథతో నాని శ్రీకాంత్ ప్యారడైజ్ వస్తుందని అంటున్నారు. ఐతే ఈ సినిమా కథకు కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కూడా రిఫరెన్స్ అని తెలుస్తుంది. నానిని మరోసారి టాప్ రేంజ్ లో నిలబెట్టేలా ప్యారడైజ్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో నాని క్యారెక్టరైజేషన్ ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు.
