నాని-సుజీత్.. ఓ టార్గెట్ సెట్టయ్యింది!
మే 1న వచ్చిన ‘హిట్ 3’ సినిమా రూ. 100 కోట్ల మార్క్‌ను దాటి, ఈ ఏడాది నాల్గవ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది
By: Tupaki Desk | 16 May 2025 11:39 AM ISTనాచురల్ స్టార్ నాని వరుస హిట్స్‌తో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధిస్తూ, తన స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. మే 1న వచ్చిన ‘హిట్ 3’ సినిమా రూ. 100 కోట్ల మార్క్‌ను దాటి, ఈ ఏడాది నాల్గవ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాని ఇంటెన్స్ కాప్ రోల్‌లో అదరగొట్టాడు.
ఇక నాని రాబోయే సినిమా ‘ది ప్యారడైజ్’ కూడా భారీ డిమాండ్‌ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం 1980ల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆడియో రైట్స్ ఇప్పటికే రూ. 18 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం, ఇది సినిమాపై ఉన్న హైప్‌ను చూపిస్తోంది.
తాజాగా నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో రూపొందే సినిమా టార్గెట్ కూడా సెట్టయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 2025 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దసరా తర్వాత మొదలై, ఆ తరువాత షూటింగ్ దశకు సిద్ధం కానుంది. సుజీత్ OG సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమాతో నానిని ఓ పవర్‌ఫుల్, మాస్ అవతార్‌లో చూపించనున్నాడని టాక్. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఈ సినిమా మొదట DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించాలని ప్లాన్ చేసినప్పటికీ, బడ్జెట్ సమస్యలతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. అయితే, నాని ఈ కథను ఎంతగా ఇష్టపడ్డాడంటే, సుజిత్ తో ఎలాగైనా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. కొత్త నిర్మాణ సంస్థ సపోర్ట్‌తో ఈ సినిమా ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్లనుంది. 2026లో విడుదల కానున్న ఈ సినిమా, నాని అభిమానులకు మరో యాక్షన్ ట్రీట్‌గా నిలవనుంది.
మొత్తంగా, నాని వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న ఈ సమయంలో, సుజీత్‌తో కొత్త సినిమా షూటింగ్ నవంబర్‌లో మొదలవుతుండటం అభిమానులకు సంతోషకరమైన వార్త. ‘ది ప్యారడైజ్’, సుజీత్ సినిమాతో నాని 2026లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.
