Begin typing your search above and press return to search.

నాని- సుజీత్ మూవీ.. ఆ అనౌన్స్మెంట్ కు టైమ్ ఆగయా!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

By:  Tupaki Desk   |   7 May 2025 4:38 PM IST
Nani Next Big Leap Paradise, Sujeeth Bloody Romeo
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అదే సమయంలో హిట్స్ కూడా అలాగే కొడుతున్నారు. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న నాని.. ఇప్పుడు థియేటర్స్ లో హిట్-3 మూవీతో ఏ రేంజ్ లో సందడి చేస్తున్నారు.

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఆ సినిమాతో ఇప్పటికే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టారు నాని. ఇప్పుడు ప్యారడైజ్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. భారీ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

నెవ్వర్ బిఫోర్ మూవీగా ప్యారడైజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో నాని చేతిలో సుజీత్ మూవీ కూడా ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితం ఆ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఇంకా సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఎందుకంటే.. సుజీత్ పవర్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో లాక్ అయిపోయారని చెప్పాలి.

ఇప్పటికే ఓజీ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల మూవీ హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. రీసెంట్ గా పెండింగ్ షూటింగ్ కు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో చిత్రీకరణను సుజీత్ పూర్తి చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆగస్టు- సెప్టెంబర్ లో ఓజీ రిలీజ్ కానుందట.

ఆ తర్వాత ఫ్రీ అయ్యే సుజీత్.. నాని మూవీపై ఫోకస్ చేయనున్నారని సమాచారం. దసరా తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో షూటింగ్ ను మొదలు పెట్టనున్నారని వినికిడి. 2027లో సుజీత్ తో చేయనున్న సినిమా రిలీజ్ అవుతుందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నాని చెప్పారు.

అయితే ఆ సినిమాకు టైటిల్ ను బ్లడీ రోమియోగా ఫిక్స్ చేసినట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అంతా సెట్ అయిందని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. అందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారని టాక్. కాగా, నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ గా నిలవనున్న సుజీత్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.