Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ చాప్టర్ క్లోజ్.. నాని ఓపెన్ అయ్యాడుగా..!

సరిపోదా శనివారంతో హిట్ అందుకున్న నాని నెక్స్ట్ హిట్ 3 తో వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా వన్ మ్యాన్ షో చేస్తూ అదరగొట్టేస్తున్నాడు నాని

By:  Tupaki Desk   |   25 April 2025 6:00 PM IST
బిగ్ బాస్ చాప్టర్ క్లోజ్.. నాని ఓపెన్ అయ్యాడుగా..!
X

టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న హీరో ఎవరంటే అది న్యాచురల్ స్టార్ నానినే అని చెప్పక తప్పదు. తన రేంజ్ సినిమాలు చేస్తూ సినిమా సినిమాకు అదిరిపోయే రిజల్ట్ అందుకుంటున్నాడు నాని. ముఖ్యంగా నాని సినిమా అంటే ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా చేసుకున్నాడు. సరిపోదా శనివారంతో హిట్ అందుకున్న నాని నెక్స్ట్ హిట్ 3 తో వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా వన్ మ్యాన్ షో చేస్తూ అదరగొట్టేస్తున్నాడు నాని.

నాని కెరీర్ లో కూడా అప్స్ అండ్ డౌన్ చూశాడు. ఐతే ఆ టైం లో తన మీద తనకున్న నమ్మకాన్ని కోల్పోలేదు. ఇదిలాఉంటే నాని బిగ్ బాస్ రియాలిటీ షోని హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ని నాని హోస్ట్ చేశాడు. ఎన్టీఆర్ మొదటి సీజన్ హోస్ట్ చేయగా సెకండ్ సీజన్ ని నాని హోస్ట్ చేశాడు. ఐతే బిగ్ బాస్ సీజన్ 2 చివరి రోజే ఇక బిగ్ బాస్ కి గుడ్ బై అనే మెసేజ్ కూడా చేశాడు నాని.

ఎప్పుడు అడిగినా బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ ఒకసారి చాలని అంటూ చెప్పాడు కానీ డీటైల్స్ చెప్పలేదు. హిట్ 3 ప్రమోషన్స్ లో నాని బిగ్ బాస్ హోస్ట్ గా ఎందుకు కొనసాగించలేదో క్లారిటీ ఇచ్చాడు. బిగ్ బాస్ హోస్ట్ గా చేయడానికి ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ కోసమే అని కాకపోతే అది చేయడం వల్ల తనకు కొత్త విషయాలు తెలిసాయని. అది ఒక మిర్రర్ లా పనిచేసిందని చెప్పాడు నాని. బిగ్ బాస్ చాప్టర్ క్లోజ్ అని అన్నాడు నాని. అంతేకాదు అక్కడ అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవని. షో లో ఉన్నంత సేపు ఒకలా పూర్తయ్యే సరికి మరోలా.. ఒక ఏడాది దాటాక ఇంకోలా ఇలా అభిప్రాయాలు మారుతాయని అన్నాడు నాని.

నాని బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన టైం లో కాస్త నెగిటివిటీ మూట కట్టుకున్నాడు. అందుకే ఈ గోల అంతా తనకు ఎందుకని ఎంచక్కా హోస్ట్ గా గుడ్ బై చెప్పాడు. బిగ్ బాస్ సీజన్ 2 నాని చేశాక సీజన్ 3 నుంచి మన కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. సీజన్ 3 నుంచి లాస్ట్ ఇయర్ జరిగిన సీజన్ 8 వరకు నాగార్జున హోస్ట్ గా చేస్తూ వచ్చారు.