Begin typing your search above and press return to search.

నానికి రిస్క్ లు అలవాటే కదా..?

కోర్ట్ సినిమా ఈ రేంజ్ సక్సెస్ అయ్యింది అంటే అది నాని వల్లే. ఎందుకంటే నాని నిర్మించాడు కాబట్టే ఆ సినిమా ఇంతగా జనాల్లోకి వెళ్లింది.

By:  Tupaki Desk   |   2 April 2025 9:15 AM IST
నానికి రిస్క్ లు అలవాటే కదా..?
X

ఈ మధ్యనే నిర్మాతగా కోర్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఓ పక్క హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు అందిస్తూ మరోపక్క నిర్మాతగా కూడా తన అభిరుచికి తగిన సినిమాలు చేస్తుంది. హీరోగా నిర్మాతగా నాని డబుల్ రోల్ పరిశ్రమకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. సినిమా విషయంలో నాని తీసుకునే కొన్ని నిర్ణయాలు కాస్త సాహసోపేతంగా ఉన్నా అందుకు తగినట్టుగానే ఫలితాలు ఉంటాయి.

కోర్ట్ సినిమా ఈ రేంజ్ సక్సెస్ అయ్యింది అంటే అది నాని వల్లే. ఎందుకంటే నాని నిర్మించాడు కాబట్టే ఆ సినిమా ఇంతగా జనాల్లోకి వెళ్లింది. ప్రియదర్శి తప్ప అందులో పెద్దగా తెలిసిన నటులు కూడా లేరు కానీ నాని బ్రాండ్ తో వచ్చిన సినిమా కాబట్టి 50 కోట్ల మార్క్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక నిన్నటి దాకా కోర్ట్ పనుల్లో బిజీగా ఉన్న నాని నెక్స్ట్ రిలీజ్ హిట్ 3 మీద ఫోకస్ పెట్టాడు.

శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన హిట్ థర్డ్ ఫ్రాంచైజ్ సినిమాకు ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ అంచనాలు పెంచింది. ఐతే ఈ సినిమా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ప్యారడైజ్ సినిమా విషయంలో మరోసారి రిస్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నానికి రిస్క్ అలవాటేగా అనుకోవచ్చు.. ఇంతకీ ప్యారడైజ్ విషయంలో నాని ఏం చేస్తున్నాడు అంటే. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక కొత్త అమ్మాయికి ఛాన్స్ ఇస్తున్నారట.

అంటే తెలుగులో కొత్త కానీ ఆల్రెడీ వేరే భాషల్లో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన కథానాయికనే తెస్తున్నారట. ప్యారడైజ్ సినిమా నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న సినిమా. ఈ సినిమా విషయంలో ప్రతి నిర్ణయం సినిమా మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. అలాంటిది నాని ఇలా కొత్త హీరోయిన్ తో చేయడం కాస్త రిస్కే అని చెప్పొచ్చు. ఐతే ఆల్రెడీ సౌత్ లో ఉన్న హీరోయిన్స్ అందరితో జత కట్టిన నాని మళ్లీ వాళ్లను రిపీట్ చేయడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఐతే కంటెంట్ మీద నమ్మకంతో సినిమాలు చేసే నాని ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుంది. మరి ప్యారడైజ్ విషయంలో తన నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి.