Begin typing your search above and press return to search.

2026 రెండు టార్గెట్ పెట్టిన నాని..?

నాని నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఫస్ట్ స్టేట్మెంట్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు.

By:  Tupaki Desk   |   10 May 2025 8:30 AM IST
2026 రెండు టార్గెట్ పెట్టిన నాని..?
X

టాలీవుడ్ సూపర్ ఫాం లో ఉన్న హీరోల్లో నాని టాప్ ప్లేస్ లో ఉన్నాడని చెప్పడంలో సందేహం లేదు. స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతుంటే నాని తన మార్కెట్ పరిధిలో సినిమాలు చేస్తూ వాటికి తగినట్టుగానే హిట్లు సూపర్ హిట్లు అందుకుంటూ సక్సెస్ మేనియా కొనసాగిస్తున్నాడు. రీసెంట్ గానే హిట్ 3 అంటూ వచ్చి నాని చేస్తున్న బాక్సాఫీస్ హంగామా తెలిసిందే. ఐతే హిట్ 3 ని కేవలం క్రైం థ్రిల్లర్ ఆడియన్స్ మాత్రమే కాకుండా కామన్ సినీ లవర్స్ కూడా చూశారు అంటే అది వల్లే అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ కాస్త వైలెన్స్ పార్ట్ ఎక్కువ ఉన్నా అది జస్టిఫైడ్ అనేలా ఆడియన్స్ నుంచి థమ్స్ అప్ సంపాదించింది.

ఐతే నాని నెక్స్ట్ సినిమాల మీద హిట్ 3 ఇంపాక్ట్ ఉంటుందని చెప్పొచ్చు. నాని నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఫస్ట్ స్టేట్మెంట్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు. అంతేకాదు 2026 మార్చి రిలీజ్ అంటూ డేట్ కూడా లాక్ చేశాడు. నాని రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు అంటే దాదాపు అనుకున్న డేట్ కి సినిమా వచ్చే అవకాశం ఉంది. అలా తన షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాడు.

ఇక ప్యారడైజ్ తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో చేయాల్సిన సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఐతే ఆ సినిమా షూటింగ్ ఈ ఇయర్ లోనే మొదలు పెట్టే ఛాన్స్ ఉందట. ఐతే ఎప్పుడు స్టార్ట్ చేసినా 2026 చివరి కల్లా అది కూడా రిలీజ్ ఉండేలా నాని ప్లాన్ చేస్తున్నాడట. నాని సుజిత్ కాంబో సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది.

ఈ రెండు సినిమాలతో నాని నెక్స్ట్ ఇయర్ తన ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరించనున్నాడు. ప్యారడైజ్ ఎలాగు భారీ హైప్ తో వస్తుంది ఆ సినిమా నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ మాత్రమే కాదు నానికి హైయెస్ట్ కలెక్షన్స్ కూడా తెచ్చే ప్లాన్ లో ఉన్నాడు. ఇక సుజిత్ సినిమా విషయంలో ప్లానింగ్ ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి నాని తన సినిమాలతో ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. మరి రాబోతున్న నాని సినిమాలు బాక్సాఫీస్ పై ఇంకెంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయన్నది చూడాలి.