Begin typing your search above and press return to search.

నిర్మాత నాని నెక్స్ట్ గురి ఎవరు..?

సక్సెస్ హీరోగానే కాదు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కూడా నాని తన మార్క్ ఏంటన్నది చూపిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   14 May 2025 2:00 PM IST
నిర్మాత నాని నెక్స్ట్ గురి ఎవరు..?
X

సక్సెస్ హీరోగానే కాదు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కూడా నాని తన మార్క్ ఏంటన్నది చూపిస్తున్నాడు. నాని సినిమా అంటే అది తను నటించిన సినిమానే అయినా లేదా నిర్మాతగా చేసిన సినిమా అయినా పక్కా కంటెంట్ ఉంటుందని ఫిక్స్ అయ్యారు. అందుకే అతని సినిమాలకు మంచి ఫలితాలు వస్తున్నాయి. అ! సినిమాతో మొదలైన నాని ప్రొడక్షన్ హిట్ 3 తో కూడా హిట్ మేనియా కొనసాగించారు. ఐతే ఈమధ్యనే నాని నుంచి కోర్ట్ సినిమా వచ్చింది. రామ్ జగదీష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కోర్ట్ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా విషయంలో నాని మొదటి నుంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వచ్చాడు. కోర్ట్ సినిమా తర్వాత నాని నెక్స్ట్ సినిమా ఏమవుతుందా అన్న చర్చ మొదలైంది. అంతేకాదు నాని నిర్మాణంలో సినిమా చేయాలని దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. నాని చేతిలో పడితే డైరెక్టర్ గా ఫేట్ మారినట్టే అని ఫిక్స్ అయ్యారు. నాని నిర్మాతగా వాల్ పోస్టర్ ప్రొడక్షన్ బ్యానర్ లో నెక్స్ట్ సినిమా ఏం అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

ఐతే నాని ఏ సినిమాతో వచ్చినా సరే తప్పకుండా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే సినిమాతోనే వస్తారని ఫిక్స్ అయ్యారు. ఐతే నాని తన వాల్ పోస్టర్ సినిమాస్ మాత్రమే కాకుండా యునానిమస్ అంటూ మరో బ్యానర్ మొదలు పెట్టాడు. నాని తో పాటు స్టార్స్ తో చేసే సినిమాలకు యునానిమస్ బ్యానర్లో సినిమాలు చేయాలని ఫిక్స్ అవ్వగా.. వాల్ పోస్టర్ బ్యానర్ లో మాత్రం కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయాలని చూస్తున్నాడు.

ఏ ముహూర్తంలో నాని నిర్మాతగా మారాలని అనిపించిందో కానీ కంటెంట్ ఉన్న సినిమాలతో నాని నిర్మాతగా తన బ్రాండ్ వాల్యూని కొనసాగిస్తున్నాడు. తప్పకుండా నాని బ్యానర్ నుంచి గొప్ప సినిమాలు వస్తాయని చెప్పొచ్చు. కోర్ట్ తరహా రియల్ కంటెంట్ సినిమాలను నాని ఎంకరేజ్ చేయాలని చూస్తున్నాడు. మరి నాని ప్రొడక్షన్ లో నెక్స్ట్ సినిమా ఏం వస్తుందో చూడాలి. నాని యునానిమస్ ప్రొడక్షన్ లో మొదటిగా మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబో సినిమా లాక్ చేసిన విషయం తెలిసిందే. ప్యారడైజ్ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల చిరంజీవి సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ త్వరలో బయటకు రానున్నాయి.