Begin typing your search above and press return to search.

నాని.. న్యూ కిర్రాక్ లుక్!

పొడవాటి గడ్డం, స్టైలిష్ బీనీ క్యాప్, కూల్ గ్లాసెస్‌తో నాని కనిపించిన ఈ లుక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆయన ఇంత రగ్గ్డ్ అండ్ మోడర్న్ లుక్‌లో కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

By:  Tupaki Desk   |   2 Sept 2025 12:32 AM IST
నాని.. న్యూ కిర్రాక్ లుక్!
X

నేచురల్ స్టార్ నాని - టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ పై రోజు రోజుకి హైప్ పెరుగుతోంది. దసరా వంటి రా రస్టిక్ హిట్ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ కలవడం మాస్ ఆడియెన్స్ కు ఫుల్ ట్రీట్ అందుతుందని చెప్పవచ్చు. గ్లోబల్ స్టాండర్డ్స్‌లో సినిమా ప్లాన్ అవ్వడం వల్ల అంచనాలు రెట్టింపయ్యాయి. 2026 మార్చి 26న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.

ఇప్పటి వరకు మేకర్స్ రా స్టేట్‌మెంట్ గ్లింప్స్, మొదటి లుక్ పోస్టర్ వదిలారు. అవి సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి రెస్పాన్స్ తెచ్చాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ట్రేడ్ వర్గాలు కూడా సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. నాని ఈసారి కేరక్టర్ ప్రెజెంటేషన్‌లో కొత్తగా ఏం చేస్తాడా అనేది అందరి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇక లేటెస్ట్ గా నాని షేర్ చేసిన లుక్ మాత్రం అంచనాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. పొడవాటి గడ్డం, స్టైలిష్ బీనీ క్యాప్, కూల్ గ్లాసెస్‌తో నాని కనిపించిన ఈ లుక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆయన ఇంత రగ్గ్డ్ అండ్ మోడర్న్ లుక్‌లో కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇది నాని కెరీర్‌లోనే బెస్ట్ లుక్.. ఈ లుక్‌లో ఆయన గ్యాంగ్‌స్టర్ వైబ్ స్పష్టంగా కనిపిస్తోంది.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

నాని కోసం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకంగా ఒక బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ డిజైన్ చేశారని టాక్. ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి తగ్గట్టే లీన్, మసిల్డ్ బాడీతో కనిపిస్తున్న నాని, తన క్యారెక్టర్‌లో పూర్తిగా మెల్ట్ అయినట్లు కనిపిస్తున్నారు. ఈ లుక్ వెనుక ఉన్న కష్టాన్ని ఫ్యాన్స్ గమనించి ఆయన డెడికేషన్‌ని ప్రశంసిస్తున్నారు.

ది ప్యారడైజ్ కథ 1980ల కాలంలోని హైదరాబాదు గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఇందులో నాని సరసన కయాదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ జూయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్వరపరుస్తున్నందున, ఆల్బమ్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి, నాని కొత్త లుక్‌తో ది ప్యారడైజ్ పై హైప్ మాక్సిమమ్ లెవెల్‌కి చేరుకుంది. ఈ సినిమా నాని కెరీర్‌లో ఒక బిగ్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. మరి రాబోయే అప్డేట్స్ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి.