మన నాని.. ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడుగా!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 1 Jun 2025 4:01 PM ISTటాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు హీరోగా దూసుకుపోతూనే.. మరో వైపు నిర్మాతగా రాణిస్తున్నారు. రీసెంట్ గా లీడ్ రోల్ లో నటించిన హిట్ ది థర్డ్ కేస్ తో సూపర్ హిట్ అందుకున్నారు. అదే సమయంలో చిన్న మూవీ కోర్ట్ తో మంచి సక్సెస్ ను సాధించారు.
రెండు సినిమాలు.. నెల గ్యాప్ లోనే రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అనేక మందిని మెప్పించాయి. బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను రాబట్టాయి. సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. నానికి అరుదైన ఘనతలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆ రెండు సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చాయి.
ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లోనే రెండు చిత్రాలు హిట్-3, కోర్ట్ ఇప్పుడు స్ట్రీమింగ్ అవ్వడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ కూడా దూసుకుపోతున్నాయి. ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్నాయి. టాప్ లిస్ట్ లో స్థానం సంపాదించుకున్నాయి. నెం.1లో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్-3 ఉండగా, కోర్ట్ రూమ్ డ్రామా కోర్ట్ 8వ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది.
అలా నానికి సంబంధించిన రెండు సినిమాలు.. ఓటీటీలో ఇప్పుడు సందడి చేస్తున్నాయి. అయితే శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్-3లో అర్జున్ సర్కార్ రోల్ పోషించారు నాని. నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించి మెప్పించారు. ఇప్పటివరకు కెరీర్ లో అంత వైలెన్స్ తో ఉన్న పాత్రలో నాని కనిపించడం ఇదే మొదటిసారి.
మరోవైపు, కోర్ట్ మూవీలో ప్రముఖ నటుడు ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించగా, తక్కువ బడ్జెట్ తోనే స్పెషల్ గా నాని నిర్మించారు. చిన్న సినిమాల్లో అత్యంత లాభాలు తీసుకొచ్చిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా నానికి ప్రశంసలు వచ్చాయి.
కాగా, నాని త్వరలో శ్రీకాంత్ ఓదెలతో వర్క్ చేయనున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పారడైజ్ ను ప్రారంభించబోతున్నారు. మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాత నటించాల్సిన సినిమాలు ఇప్పటికే లైన్ లో పెట్టేశారు. అటు చిరు- ఓదెల మూవీ సహా పలు ప్రాజెక్టులను నిర్మించనున్నారు. మరి ఫ్యూచర్ లో నాని ఎలాంటి సక్సెస్ లు అందుకుంటారో వేచి చూడాలి.
