Begin typing your search above and press return to search.

నాని -కీర్తి సురేష్ హ్యాట్రిక్ ఎప్పుడు?

మ‌రో నాయిక పేరు కూడా విని పిస్తుంది. ఈ సినిమా అనంత‌రం నాని ఏ డైరెక్ట‌ర్ తో ప‌నిచేస్తాడు? అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు

By:  Tupaki Desk   |   8 July 2025 8:00 AM IST
నాని -కీర్తి సురేష్ హ్యాట్రిక్ ఎప్పుడు?
X

నేచురల్ స్టార్ నాని-కీర్తి సురేష్ కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రిది స‌క్సెస్ పుల్ క‌ల‌యిక‌. ఇద్ద‌రు జంట‌గా తొలిసారి న‌టించిన `నేను లోక‌ల్` భారీ విజ‌యం సాధించింది. అటుపై `ద‌సరా`తో మ‌ళ్లీ చేతులు క‌లిపారు. ఈ సినిమాతో ఏకంగా వంద కోట్ల క్ల‌బ్లో కి చేరారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన పీరియాడిక్ చిత్రం భారీ మాస్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో నాని క్రేజ్ మాస్ లో రెట్టింపు అయింది. కీర్తి కెరీర్ కి ఈ సినిమాలు గొప్ప స‌క్సెస్ ని అందించిన‌వే.

ఇత‌ర హీరోల‌తో కొన్ని సినిమాలు చేసినా? ఆ సినిమా ఫ‌లితాలు ఆశించిన రేంజ్ లో రాలేదు. నానితో మాత్రం కీర్తికి క‌లిసొచ్చింది. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు హ్యాట్రిక్ చిత్రం ఎప్పుడు చేస్తారు? అన్న చ‌ర్చ అభిమా నుల్లో మొద‌లైంది. ఆ కాంబినేష‌న్ ని మ‌రోసారి తెర‌పై చూడాల‌ని ప్రేక్ష‌కులు ఆశ ప‌డుతున్నారు. మ‌రి ఆ ఛాన్స్ ఏ ద‌ర్శ‌కుడు తీసుకుంటాడో చూడాలి. ప్ర‌స్తుతం లైన‌ప్ లో ఉన్న నాని న‌టిస్తోన్న ఏ సినిమాల్లోనూ కీర్తి న‌టించ‌లేదు. నాని న‌టిస్తోన్న `ది ప్యార‌డైజ్` లో కృతి శెట్టి ఎంపికైంది.

మ‌రో నాయిక పేరు కూడా విని పిస్తుంది. ఈ సినిమా అనంత‌రం నాని ఏ డైరెక్ట‌ర్ తో ప‌నిచేస్తాడు? అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు. ఆ డైరెక్ట‌ర్ అయినా హిట్ కాంబినేష‌న్ కి క‌లుపుతాడేమో చూడాలి. కీర్తి సురేష్ కూడా హీరోయిన్ గా బిజీగానే ఉంది. తెలుగు, హిందీ చిత్రాలు చేస్తోంది. అలాగే త‌మిళ్ లోనూ కొన్ని సినిమాలు చేస్తోంది. `రివాల్వ‌ర్ రీటా` కీర్తి న‌టిస్తోన్న త‌మిళ లేడీ ఓరియేంటెడ్ చిత్రం. `ర‌ఘుతాత` త‌ర్వాత కోలీవుడ్ లోనే న‌టిస్తోన్న మ‌రో ఉమెన్ సెంట్రిక్ చిత్రం కావ‌డం విశేషం.

నిజానికి అమ్మ‌డికి కోలీవుడ్ కంటే టాలీవుడ్ లో మెరుగైన మార్కెట్ ఉంది. కానీ ఇక్క‌డ కంటే అక్క‌డే ఎక్కు వ అవ‌కాశాలు అందుకోవ‌డం విశేషం. ఇటీవలే కీర్తి సురేష్ న‌టించిన `ఉప్పుక‌ప్పురంబు` రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈ సినిమా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ప్ర‌స్తుతం కోలీవుడ్ లోనే `క‌న్నైవెడి` అనే మ‌రో సినిమా కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.