ది ప్యారడైజ్.. అసలైన ఆట ఇప్పుడు మొదలైంది
టాలెంటెడ్ హీరో నాచురల్ స్టార్ నాని, 'దసరా'తో మాస్ మార్కెట్‌ను ఓ రేంజ్‌లో రీచ్ అయ్యాడు.
By: Tupaki Desk | 28 Jun 2025 3:51 PM ISTటాలెంటెడ్ హీరో నాచురల్ స్టార్ నాని, 'దసరా'తో మాస్ మార్కెట్‌ను ఓ రేంజ్‌లో రీచ్ అయ్యాడు. ఆ సినిమా విజయంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ ‘ది ప్యారడైజ్’ అంటూ తెరపైకి రాబోతోంది. పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్ సృష్టించింది. మొదట వచ్చిన గ్లింప్స్ అయితే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా చర్చనీయాంశమైంది.
అన్ని భాషల ప్రేక్షకులలో ఆసక్తిని రేపిన ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. జూన్ 21న చిన్న నాటి సన్నివేశాలతో స్టార్ట్ చేసిన టీమ్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో 40 రోజుల పాటు కీలక సీన్లు షూట్ చేయనున్నారు. తాజాగా హీరో నాని సెట్స్‌లో జాయిన్ అయ్యాడు.
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో నాని లేటెస్ట్ గెటప్‌ను షేర్ చేస్తూ హైప్‌ను మరింత పెంచారు. ఈ గెటప్‌లో నాని మాస్, ఫ్యాక్షన్, రగిలే ఉనికిని ప్రతిబింబిస్తూ ‘ధగద్’ గెటప్‌లో అదరగొడుతున్నారు. ఈ లుక్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ ఫీడ్ చేస్తుండగా, మేకర్స్ కాన్ఫిడెన్స్ కూడా అందులో కనిపిస్తోంది. ‘దసరా’ తర్వాత చాలా డెడికేషన్‌తో ఈ కథను రూపొందించిన శ్రీకాంత్.. ఇది తెలుగు సినిమాకు ఓ ట్రెండ్ సెట్టర్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ఇక మ్యూజిక్ పరంగా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించనుండటంతో అంచనాలు మరో లెవెల్‌కు చేరాయి. ఇప్పటికే మ్యూజిక్ ఆల్బమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టెక్నికల్ టీమ్‌లో కొంత మార్పులు జరిగినా, దర్శకుడి విజన్‌కు తగ్గట్లు సినిమాను గ్రాండ్‌గా రూపొందించేందుకు టీమ్ పూర్తిగా రెడీ అయింది.
ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి భారీగా నిర్మాణం నిర్వహిస్తున్నారు. నాని కెరీర్‌లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కావడం విశేషం. కథా పరంగా, విజువల్ స్కేల్ పరంగా కూడా ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందని సమాచారం. ‘దసరా’ సమయంలో వచ్చిన బాక్సాఫీస్ మేజిక్‌ను మళ్లీ ఈ సినిమాతో రిపీట్ చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.‘ది ప్యారడైజ్’ 2026 మార్చి 26న 8 భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటిదాకా వచ్చిన అప్‌డేట్స్ చూస్తే ఈ సినిమా నానికి గోల్డెన్ హిట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
