మా పిన్నికి నా సినిమా నచ్చలేదు
ప్రస్తుతం నాని నటిస్తున్న హిట్3 సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్.
By: Tupaki Desk | 19 April 2025 6:22 AMవరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ లో ఉన్న నేచురల్ స్టార్ నాని ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ ఆడియన్స్ ను అలరిస్తూ వారిని మెప్పిస్తూనే వస్తున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హీరోగా హ్యాట్రిక్ హిట్లు అందుకున్న నాని, రీసెంట్ గానే కోర్టు సినిమాతో నిర్మాతగా కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాడు.
ప్రస్తుతం నాని నటిస్తున్న హిట్3 సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన మొదటి రెండు భాగాలు మంచి సక్సెస్ ను అందుకోవడంతో మూడో భాగంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. వయొలెంట్ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని మీడియా ముందుకొచ్చి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నాడు.
హిట్3 సినిమా గురించి మాట్లాడుతూ అసలు తాను ఈ సినిమా చేద్దామనుకోలేదని, హిట్2 ఎండింగ్ లో ఏదొక చిన్న క్యామియో చేస్తే బావుంటుందని డైరెక్టర్ చెప్పడంతో అప్పటికప్పుడు సెట్ చేసుకుని చేశామని చెప్పిన నాని, తాను ఆల్రెడీ చాలా సినిమాలు కమిట్ అవడంతో హిట్3 తీసినప్పుడు సంగతిలే అనుకున్నానని, కానీ తన లైనప్ లోని సినిమా ఒకటి అనుకోకుండా వాయిదా పడటంతో ఆ గ్యాప్ లో శైలేష్ ను కథ ఉందా అంటే హిట్3 కథ చెప్పాడని, ఆ కథ నచ్చడంతో వెంటనే హిట్3 మొదలైందని చెప్పాడు నాని.
హిట్3 లో యాక్షన్, వయొలెన్స్ చూసి అందరూ యానిమల్, కిల్ సినిమాలు గుర్తొస్తున్నాయంటున్నారని, ఆ సినిమాలు హిట్ అయ్యాయని వాటిని చూసే అలా ట్రై చేశారా అంటున్నారని కూడా నాని ఈ సందర్భంగా తెలిపాడు. కానీ తనకు ఆ సినిమాల పేర్లు హిట్3 పూర్తయ్యాక మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడే తెలిశాయని నాని వెల్లడించాడు. సినిమాలో అందరూ వయొలెన్స్ గురించే మాట్లాడుకుంటున్నారని కానీ దానికి మించిన ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుందని, కాకపోతే యాక్షన్ సీన్స్ ను ఎక్కువగా చూపించామని నాని తెలిపాడు.
ఇక సినిమాలో తమ కంటెంట్ గురించి పదేపదే ఆడియన్స్ కు చెప్పడం వెనుక కూడా ఓ కారణముందని, అలా చెప్తే ఆడియన్స్ ఓ క్లారిటీతో సినిమాకు వస్తారని, అలా చెప్పకుండా ఆడియన్స్ ఒక మైండ్ తో వచ్చి, తీరా సినిమా చూశాక డిజప్పాయింట్ అయితే అది సినిమాకు మరింత నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పిన నాని, తన పిన్నికి కామెడీ సినిమాలే నచ్చుతాయని, తాను చేసిన దసరా సినిమా కూడా ఆమెకు నచ్చలేదని, అందుకే హిట్3 టీజర్, ట్రైలర్ చూడొద్దని ముందే ఆమెకు చెప్పినట్టు నాని చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా తన కెరీర్ లో బెన్ హర్ లాంటి ఎపిక్ మూవీ చేయాలనేది తన డ్రీమ్ అని చెప్పిన నాని, ఇన్నాళ్లూ తనకు మార్కెట్ లేకపోవడం వల్లే అలాంటి ప్రయత్నం చేయలేదని, ఇప్పుడు తనకు ఆ మార్కెట్ వచ్చిందని చెప్తున్నాడు. ఈ ఏడాది మొత్తానికి తన నుంచి వచ్చే సినిమా హిట్3 మాత్రమేనని, నెక్ట్స్ ఇయర్ శ్రీకాంత్ తో చేస్తున్న ది ప్యారడైజ్ రానుందని నాని క్లారిటీ ఇచ్చాడు.