Begin typing your search above and press return to search.

నాని ఇంట్రో సీన్ లీక్.. అస‌లు విష‌య‌మేంటంటే

వ‌రుస స‌క్సెస్‌ల‌తో బిజీగా ఉన్న నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరో అయిపోయాడు.

By:  Tupaki Desk   |   7 April 2025 2:56 PM IST
Nani HIT 3 Video Leak Rumors Clarified
X

వ‌రుస స‌క్సెస్‌ల‌తో బిజీగా ఉన్న నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరో అయిపోయాడు. నానితో సినిమా అంటే డ‌బ్బులు పెట్ట‌డానికి ఏ నిర్మాతైనా ముందుకొచ్చే స్థాయికి నాని ఎదిగాడు. ప్ర‌స్తుతం శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో హిట్: ది థ‌ర్డ్ కేస్ సినిమా చేస్తున్న నాని, ఆ సినిమా త‌ర్వాత శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ది ప్యార‌డైజ్ సినిమాను లైన్ లో పెట్టిన విష‌యం తెలిసిందే.

ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు నిర్మాత‌గా ఆడియ‌న్స్ కు మంచి కంటెంట్ ను అందిస్తూ, ఇండ‌స్ట్రీకి కొత్త టాలెంట్ ను ప‌రిచ‌యం చేస్తున్నాడు నాని. ఇదిలా ఉంటే రీసెంట్ గా హిట్3 నుంచి నాని ఇంట్ర‌డక్ష‌న్ సీన్ ఆన్ లైన్ లో లీక్ అయింద‌ని సోషల్ మీడియాలో బాగా వార్త‌లొచ్చాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం లీకైన ఫోటోలు, వీడియోలు హిట్3కు సంబంధించిన‌వి కావ‌ని తెలుస్తోంది.

నానికి సంబంధించి రీసెంట్ గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న విజువ‌ల్స్ ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ షూట్ కు చెందిన‌వ‌ని తెలుస్తోంది. నాని ఓ ప్రముఖ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ తో క‌లిసి చేసిన యాడ్ కు సంబంధించిన వీడియోనే ఇప్పుడు లీకైంద‌ని, అవి నాని న‌టిస్తున్న ఏ సినిమాకూ సంబంధించిన‌వి కావ‌ని స‌మాచారం.

రీసెంట్ గా హిట్3 డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను లీకుల‌పై మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. కొంత‌మంది వ్య‌క్తులు కావాల‌ని కంటెంట్ ను లీక్ చేస్తున్నార‌ని, అలా లీక్ చేసి ఆడియ‌న్స్ ఎగ్జైట్‌మెంట్ ను పాడు చేస్తున్నార‌ని, ఒక్క హిట్3 గురించి మాత్ర‌మే కాకుండా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న లీకుల గురించి మాట్లాడాడు.

ఇక హిట్3 విష‌యానికొస్తే హిట్ ఫ్రాంచైజ్ సినిమాల్లో భాగంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్టిన చిత్ర యూనిట్ త్వ‌ర‌లోనే వాటిని మ‌రింత వేగ‌వంతం చేయ‌నుంది. ఈ సినిమాను నాని త‌న సొంత బ్యాన‌ర్ వాల్‌పోస్ట‌ర్ సినిమాస్ బ్యాన‌ర్ లోనే నిర్మిస్తున్నాడు.