నాని 'హిట్ 3'.. ఈ ఐడియా పక్కా ప్లస్సే!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు హిట్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 15 April 2025 9:32 AM ISTటాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు హిట్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో వయోలెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. కెరీర్ లో నెవ్వర్ బిఫోర్ అన్న రోల్ లో సందడి చేయనున్నారు. దీంతో మూవీ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.
నిజానికి.. హిట్ -3 మూవీ వయోలెంట్ యాక్షన్ తో ఉంటుందని ముందు నుంచి హైప్ క్రియేట్ అయింది. ఆ తర్వాత టీజర్ రిలీజ్ అయ్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా ట్రైలర్ వచ్చిన తర్వాత వేరే లెవెల్ బజ్ నెలకొంది. ఇంటెన్స్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవ్వగా.. అక్కడి కాసేపటికే వయోలెంట్ యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోతుంది.
నేరస్థులను నరికేస్తూ.. రక్తపాతం సృష్టిస్తూ.. గాయాలపై ఆల్కహల్ పోసుకుంటూ రెచ్చిపోతారు నాని. ఓవరాల్ గా ఇంటెన్సిటీ, వయోలెన్స్, యాక్షన్ తో ట్రైలర్ అదిరిపోయిందని చెప్పాలి. వయోలెంట్ యాక్షన్ ను ఆకట్టుకునేలా చూపించారని అంతా చెబుతున్నారు. అదే సమయంలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
హీరో రోల్ ను చాగంటి ప్రవచనాలతో మేకర్స్ ఎలివేట్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆపదలో ఉన్నవాళ్లని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు.. ఒక్క ప్రాణాన్ని కాపాడటానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడ్తాడో ఆయనకి మాత్రమే తెలుసు.. అన్ని పరీక్షలకు తట్టుకొని నిలబడే వాడు.. అంటూ చాగంటి చెబుతున్న ప్రవచనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హిట్ 3 ట్రైలర్ లో చాగంటి ప్రవచనాల విజువల్స్.. ఫుల్ వైరల్ గా మారాయి. దీంతో మూవీ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ.. చాగంటి ప్రవచనాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షిస్తున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. అదే సమయంలో వారిని థియేటర్స్ కు రప్పించే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
అయితే హిట్ 3 కోసమే చాగంటి ఆ ప్రవచనం చెప్పారని నాని రీసెంట్ గా రివీల్ చేశారు. ఇక మూవీ విషయానికొస్తే.. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రశాంతి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మే 1న రిలీజ్ కానున్న హిట్ 3 మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.