హిట్ 3 ట్రైలర్.. నరకాన్ని తలపిస్తోన్న అర్జున్ సర్కార్ ఊచకోత
న్యాచురల్ స్టార్ నాని నుంచి మరోసారి ఓ డిఫరెంట్ గెటప్‌లో మాస్ ట్రాన్స్ఫర్మేషన్‌ను చూపించే ట్రైలర్ వచ్చేసింది.
By: Tupaki Desk | 14 April 2025 12:13 PM ISTన్యాచురల్ స్టార్ నాని నుంచి మరోసారి ఓ డిఫరెంట్ గెటప్‌లో మాస్ ట్రాన్స్ఫర్మేషన్‌ను చూపించే ట్రైలర్ వచ్చేసింది. మే 1న విడుదల కానున్న హిట్ 3: ది థర్డ్ కేస్ నుంచి ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చూస్తే నాని తన క్యారెక్టర్ లో ఎలాంటి మాస్ ఫెవర్ తీసుకురాబోతున్నాడో స్పష్టమవుతుంది. ఈసారి నాని పాత్ర పేరు అర్జున్ సర్కార్. ఓ బ్రూటల్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్న నాని పాత్రలో ఎన్నో లేయర్స్ ఉన్నాయి.
ట్రైలర్ మొత్తం డార్క్ టోన్, విభిన్న లైటింగ్ స్కీమ్స్‌తో కనిపించడం సినిమాకు ఉన్న కొత్త వాతావరణాన్ని తెలిపేలా ఉంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టెక్నికల్‌గా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ట్రైలర్‌లో నాని ఊచకోత సీన్లు నిజంగా గుగుర్పెట్టేలా ఉన్నాయి. జనంలో ఉంటే అర్జున్.. క్రిమినల్స్ మధ్యలో ఉంటే సర్కార్.. అని క్యారేక్టర్ ను బలంగా హైలెట్ చేశారు.
క్రిమినల్స్ ను అసలు ఏమాత్రం వదిలి పెట్టకూడదనే తత్వంతో ఉండే అర్జున్ సర్కార్ లో ఓ లవ్ ఏమోషన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అతని క్యారెక్టర్ ను చాగంటి ప్రవచనంతో హైలెట్ చేయడం మరో విశేషం. ముఖ్యంగా ఓ డ్రింక్ సీన్ తర్వాత ఆయన మెల్లిగా రగిలిపోతూ అరుస్తూ చెప్పే డైలాగ్ “అబ్కి బార్ అర్జున్ సర్కార్” మాస్ బ్లాక్ బస్టర్ వేటకు సంకేతమవుతుంది.
ఈసారి నాని తన కంఫర్ట్ జోన్‌ను దాటి వెళ్లి మరింత హోరాహోరీగా, ఊహించని యాంగిల్‌లో కనిపిస్తున్నాడు. ట్రైలర్‌ను చూస్తే, కథలో ఏదో జరుగుతుందనే ఆసక్తి కలుగుతుంది. కథ అంతా చెప్పకుండా, కేవలం క్యారెక్టర్ హైలైట్స్, విజువల్స్, మూడ్‌ను చూపించి ప్రేక్షకుడిని ఆకర్షించే విధంగా కట్ చేశారు. నాని కనిపించిన ప్రతీ ఫ్రేమ్‌లో డిఫరెంట్ ఎనర్జీ కనిపిస్తుంది. ముఖ్యంగా చంపే విధానం నరకాన్ని తలపించేలా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మిక్కీ జే మేయర్ మరోసారి తన మార్క్ చూపించారు. ట్రైలర్‌కు అతని సంగీతం అదనపు బలంగా మారింది. అలాగే ప్రొడక్షన్ డిజైన్, స్టైలిష్ ఫ్రేమ్స్ సినిమాను విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌గా మలుస్తున్నాయి. నిర్మాత ప్రశాంతి త్రిపినేని సినిమా కంటెంట్‌కి ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించడం స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తానికి ‘హిట్ 3’ ట్రైలర్ చూసిన తరువాత అందరిలోనూ ఒకే మాట వినిపిస్తుంది “ఈసారి నాని ఊచకోత గట్టిగానే ఉండబోతోంది.. బ్రూటల్ అర్జున్ సర్కార్” అని కామెంట్ చేస్తున్నారు. మే 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటివరకు మెల్లిగా వెళ్లిన హిట్ ఫ్రాంచైజీకి ఈసారి నాని రూపంలో బిగ్ బాంగ్ అనిపించేలా ఉంది.