నాని 'హిట్-3' రిస్క్.. ఫుల్ క్లారిటీతో నేచురల్ స్టార్!
దీంతో రీసెంట్ గా నాని.. హిట్-3 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నాని క్లాస్ మూవీసే చేయాలని అనుకునేవారు మే1వ తేదీన జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
By: Tupaki Desk | 16 April 2025 12:30 AMటాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు హిట్ 3 మూవీతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ.. మోస్ట్ వయోలెంట్ యాక్షన్ ఫిల్మ్ గా సందడి చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. వయోలెన్స్, రక్తపాతంతో ట్రైలర్ నిండిపోయిందని చెప్పాలి.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మోడ్ లో ఉన్న హిట్ 3 ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది. 24 గంటలు అవ్వకముందే 21 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుని అలరిస్తోంది. నాని తనకు ఇష్టం లేదని చెబుతున్నా.. టైర్ -2 హీరోల సినిమాల పరంగా చూసుకుంటే హిట్ -3 ట్రైలర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసి సందడి చేస్తోంది.
అయితే నాని అంటేనే క్లాస్ ఫిల్స్మ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా అంతా ఫిక్సయ్యారు. కానీ కొంతకాలంగా అటు మాస్.. ఇటు క్లాస్.. రెండు జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. దసరా మూవీతో తనలోనే మాస్ యాంగిల్ ను చూపించి ఫిదా చేశారు. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో నటించి క్లాస్ జోనర్ ను మర్చిపోలేదని చెప్పకనే చెప్పారు.
ఇక ఇప్పుడు హిట్ మూవీలో వయోలెన్స్ ఎక్కువగా ఉంటుందని అందరికీ క్లారిటీ వచ్చేసింది. దీంతో రీసెంట్ గా నాని.. హిట్-3 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నాని క్లాస్ మూవీసే చేయాలని అనుకునేవారు మే1వ తేదీన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏ జోనర్ అయినా పర్లేదు అనుకుంటే వచ్చి మూవీ చూడాలని కోరారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వయోలెన్స్ ఎక్కువగా ఉంటే ఓ వర్గం ఫ్యాన్స్ సినిమా చూడరు కదా.. నష్టం ఉంటుంది కాదా అన్న ప్రశ్నపై స్పందించారు. నిజానికి.. ఆ క్వశ్చన్ కరెక్టే. కానీ నాని మాత్రం.. ఓ వర్గం ఫ్యాన్స్ తగ్గితే మరో వర్గం పెరుగుతారని ధైర్యంగా చెప్పారు. అంత ఓపెన్ గా అలా అన్నారంటే.. దాని వెనుక రీజన్.. కంటెంట్ పై నమ్మకమే.
అదే సమయంలో నానికి హిట్-3 విషయంలో రిస్క్ ఉందని క్లియర్ గా తెలుసనే చెప్పాలి. అందుకే ఆడియన్స్ ను సినిమా రిలీజ్ కు ముందు రెడీ చేస్తున్నారు. దాంతోపాటు ఆయన మరో అప్ కమింగ్ మూవీ ప్యారడైజ్.. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీంతో ఆ సినిమాకు గాను కూడా ఇప్పటికే నుంచే ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా తన సినిమాలపై నాని ఫుల్ క్లారిటీతో ఉన్నారు.