హిట్ 3 బాక్సాఫీస్.. అనుకున్నట్లే టార్గెట్ ఫినిష్ చేసిన అర్జున్ సర్కార్!
ఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుస ఫ్లాప్‌లు చూసింది. అయితే నాని నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోసింది.
By: Tupaki Desk | 7 May 2025 1:22 PM ISTఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుస ఫ్లాప్‌లు చూసింది. అయితే నాని నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్, మే 1 రిలీజై, ఆరు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి టాలీవుడ్‌కు కొత్త జోష్ తెచ్చింది. ఈ సినిమా వరల్డ్‌వైడ్ రూ.100 కోట్ల మార్క్‌ను దాటడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో సినిమాలు ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో విఫలమవుతున్న సమయంలో, ‘హిట్ 3’ సక్సెస్ ఇండస్ట్రీకి ఊరటనిచ్చింది.
సినిమా ‘A’ సెన్సార్ తో రావడం, ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు దూరంగా ఉండాలని ముందే చెప్పడం రిస్క్‌గా భావించినా, ‘హిట్ 3’ అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. యూత్, మాస్ ఆడియన్స్‌ను ఎక్కువగా ఆకర్షించడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. నాని ఇంటెన్స్ ఐపీఎస్ రోల్, హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా యూత్‌ను థియేటర్లకు రప్పించాయి. ఈ రిస్క్ తీసుకున్నా సినిమా సక్సెస్ నాని స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించింది.
సినిమా తొలి వీకెండ్‌ను పక్కాగా ఉపయోగించుకుంది. దాదాపు అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్‌ను సంతోషపరిచింది. నైజాం, ఉత్తరాంధ్ర, ఓవర్సీస్ మార్కెట్స్‌లో సినిమా ఇప్పటికే లాభాల జోన్‌లోకి చేరింది. హైదరాబాద్‌లో హౌస్‌ఫుల్ షోలతో దూసుకెళ్లిన ఈ సినిమా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా బుకింగ్స్ జోరుగా సాగాయి. డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం.
ఇక ‘హిట్ 3’ ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా భారీ కలెక్షన్స్ అందుకుంటోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా $2 మిలియన్ (రూ.16.8 కోట్లు) మార్క్‌ను దాటింది. ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించడం నాని కెరీర్‌లో మూడోసారి, అది కూడా వరుసగా మూడో హిట్‌గా నిలిచింది. అమెరికాలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దగానే ఉన్నా, సినిమా ఆ మార్క్‌ను సులువుగా దాటేసింది. ఎన్‌ఆర్‌ఐ ఆడియన్స్‌ను ఆకర్షించడంలో నాని సత్తా మరోసారి రుజువైంది.
ఆరు రోజుల్లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘హిట్ 3’, టోటల్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా నైజం ఏరియాలో ఇప్పటికి మంచి ఆక్యుపెన్సీ సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు పెరిగినప్పటికీ, యూత్, మాస్ ఆడియన్స్ సపోర్ట్‌తో సినిమా దూసుకెళ్లింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా లాభాల జోన్‌లోకి చేరడం నాని స్టార్‌డమ్‌ను చాటుతోంది. 2025లో సాలిడ్ హిట్‌లలో ‘హిట్ 3’ ఒకటిగా నిలిచింది. వీకెండ్ తర్వాత కూడా సినిమా మంచి ఆక్యుపెన్సీతో కొనసాగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.